मंगलवार, दिसंबर 03 2024 | 01:46:44 AM
Breaking News
Home / Choose Language / telugu / లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

Follow us on:

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటైన లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… లోక్‌మంథన్‌ నిర్వహణలో పాలుపంచుకొంటున్న ఆసక్తిదారులందరినీ ప్రశంసించారు. మన దేశ సంపన్న సంస్కృతీ, సంప్రదాయాలు, వారసత్వాల ఐకమత్య బంధాన్ని బలపరిచే ఒక ప్రశంసనీయమైన ప్రయత్నమే ఈ లోక్‌మంథన్ కార్యక్రమం అని ఆమె అన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, మేథో వారసత్వానికి దేశ పౌరులందరూ తప్పక అర్థం చేసుకొని, వారి అమూల్య సంప్రదాయాలను పటిష్ట పరచాలని ఆమె స్పస్టం చేశారు.

ఈ వైవిధ్యం మన ప్రాథమిక ఐక్యతకు ఇంద్రధనుస్సు తరహా శోభను ఇస్తోందని రాష్ట్రపతి అన్నారు. మనం అడవులలో ఆవాసాలను కలిగి ఉండే వారమైనా, గ్రామాలలో నివసించే వారమైనా, లేదా నగరాల్లో నివసించే వారమైనా.. మనమంతా భారతీయులం. ఈ జాతీయ ఐకమత్య భావం అన్ని సవాళ్ళలోనూ మనల్ని ఒక్కటిగా కలిపి ఉంచిందని రాష్ట్రపతి అన్నారు.  మన సమాజాన్ని ముక్కచెక్కలు చేసి, బలహీన పరచాలని వందల ఏళ్ళుగా ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు. మన స్వాభావిక ఏకతను భంగపరచడానికి అసహజ విభజన రేఖలను సృష్టించారని, అయితే పౌరుల్లో ఉన్న భారతీయతా భావం దేశఐక్యతను కాపాడిందని రాష్ట్రపతి అన్నారు.

భారతీయ సిద్ధాంతాల ప్రభావం ప్రాచీన కాలం నాటి నుంచే ప్రపంచంలో మూల మూలకూ వ్యాపించిందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశ ధార్మిక విశ్వాసాలు, కళలు, సంగీతం, టెక్నాలజీ, వైద్య పద్ధతులు, భాషలు, సాహిత్యం ప్రపంచమంతటా వేనోళ్ళ ప్రశంసలకు పాత్రమయ్యాయని ఆమె అన్నారు. ప్రపంచానికి విలువలను అందరి కన్నా ముందుగా కానుకగా ఇచ్చింది భారతీయ తత్త్వ దర్శనమేనని ఆమె అన్నారు. మన పూర్వికుల వైభవోపేత సంప్రదాయాన్ని దృఢతరం చేయవలసిన బాధ్యత మన మీద ఉందన్నారు.

శతాబ్దాల తరబడి సామ్రాజ్యవాదం, వలస రాజ్యాలు భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకోవడం ఒక్కటే కాకుండా మన సంఘ యవనికను ధ్వంసం చేయాలని కూడా ప్రయత్నించాయని రాష్ట్రపతి అన్నారు.  మన విశిష్ట మేధోప్రధాన సంప్రదాయాలను చిన్నచూపు చూసిన పాలకులు… పౌరులలో సాంస్కృతికంగా మనం తక్కువ వారమన్న భావాన్ని చొప్పించారని ఆమె అన్నారు.  మన ఐకమత్యానికి చెరుపు చేసే సంప్రదాయాలను మన నెత్తిన రుద్దారన్నారు.  శతాబ్దాలుగా పారతంత్య్రంలో మగ్గిన కారణంగా మన పౌరులు మానసిక బానిసలుగా బాధితులుగా మిగిలిపోయారన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే పౌరులలో ‘దేశానికే ప్రాధాన్యం’ (‘నేషన్ ఫస్ట్’) ఇవ్వాలన్న భావనను పాదుగొల్పాలన్నారు. లోక్‌మంథన్ ఈ అనుభూతిని పదుగురికీ పంచుతుండడాన్ని చూసి తాను సంతోషించానని రాష్ట్రపతి అన్నారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …