విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాశాఖ- హైదరాబాద్ ఐఐటీలో మానసిక ఆరోగ్యంపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. నవంబరు 9 నుంచి రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. మానసిక ఆరోగ్యం, సమస్యలను తట్టుకునే శక్తి, శ్రేయస్సును ప్రోత్సహించే సమగ్ర విధానమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. విద్యార్థులూ, అధ్యాపకుల మానసిక ఆరోగ్యానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవస్థలను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్యాసంస్థలకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ …
Read More »ఐఎన్ఎస్ విక్రాంత్ లో భారత నావికదళ కార్యకలాపాలను వీక్షించిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
సముద్రంలో భారత నావికా దళ కార్యాచరణ ప్రదర్శనను గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గురువారం వీక్షించారు. ఐఎన్ఎస్ హన్సా (గోవా నావిక దళ ఎయిర్ స్టేషన్)కు విచ్చేసిన రాష్ట్రపతికి నావికదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠితోపాటు పశ్చిమ నావిక దళం ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ ఎడ్మిరల్ సంజయ్ జె. సింగ్ స్వాగతం పలికారు. ఆమె రాక సందర్భంగా 150 మందితో కూడిన సైనిక బృందం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం భారత నావిక దళానికి చెందిన 15 ప్రధాన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో కూడిన, దేశీయంగా రూపొందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను గోవా సముద్ర …
Read More »ఛఠ్ మహాపర్వ ఆచారాలు ప్రజలలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తాయి: ప్రధాన మంత్రి ఛఠ్ ‘సుబా కే అర్ఘ్య’ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
ఛఠ్ మహాపర్వంలో భాగంగా ఈ రోజున జరిగే ‘సుబా కే అర్ఘ్య’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛఠ్ మహాపర్వం నాలుగు రోజుల పాటు ప్రజలు పాటించే ఆచారాలు వారిలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ‘ఎక్స్’లో ఈ కింది విధంగా పేర్కొన్నారు: ‘‘ప్రకృతిని, మన సంస్కృతినీ సమాదరించడానికి ఛఠ్ మహాపర్వంలో భాగంగా నాలుగు రోజుల పాటు దేశ ప్రజలు పాటించే ఆచారాలు వారిలో ఒక కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుతాయి. ‘సుబా కే …
Read More »జైనాచార్య రత్నసుందర్ సురీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్ తో ప్రధానమంత్రి భేటీ
జైనాచార్య రత్నసుందర్ సురీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. సామాజిక సేవకు, ఆధ్యాత్మిక వాదానికి జైనాచార్య రత్నసుందర్ సురీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్ అందిస్తున్న తోడ్పాటును ప్రధాని ప్రశంసించారు. ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు: ‘‘ధులేలో, జైనాచార్య రత్నసుందర్ సురీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్ ను కలుసుకున్నాను. సామాజిక సేవకు, ఆధ్యాత్మిక వాదానికి ఆయన అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయం. అనేక విషయాలపై విస్తృతంగా ఆయన రాసిన రచనలు …
Read More »విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలు-2024కు హాజరైన భారత రాష్ట్రపతి
2024 సంవత్సరం విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (నవంబర్ 8న) హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి… క్రమశిక్షణ, నీతీ నిజాయితీలను భారతీయలు ఉన్నత ఆదర్శాలుగా భావిస్తారని అన్నారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని ఇష్టపడని భారతీయులు, చట్టాన్ని గౌరవిస్తారనీ, ఆర్భాటాలు లేని సాదాసీదా జీవితాలను గడిపేందుకు ఇష్టపడతారనీ 2300 ఏళ్ళ కిందటే ప్రఖ్యాత గ్రీకు చరిత్రకారుడు మెగస్థనీస్ పేర్కొన్నారని గుర్తు చేశారు. చైనా చరిత్రకారుడు ఫాహియన్ తదితరులు కూడా మన పూర్వీకుల నిరాడంబరత గురించి పేర్కొన్నారని శ్రీమతి ముర్ము చెప్పారు. ఈ నేపథ్యంలో ‘చిత్తశుద్ధి ద్వారా జాతి …
Read More »గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పరిశోధన, అభివృద్ధి అంశాలపై ఎక్స్‌లెన్స్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆహ్వానించిన భారత ప్రభుత్వం
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) పథకం పరిధిలో ఎక్స్‌లెన్స్ సెంటర్ల (సీఓఈ)ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా భారత ప్రభుత్వం కోరింది. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎమ్ఎన్ఆర్ఈ) ఈ నెల 4న ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా కోరింది. ప్రతిపాదనల ఆహ్వానాన్ని ఇక్కడ చూడొచ్చు… here. భారత్ లో దీర్ఘ కాలం పాటు గ్రీన్ హైడ్రోజన్ సంబంధిత నూతన ఆవిష్కరణలను కొనసాగించడానికీ, గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడానికీ, ఇంధన వాడకం పరంగా మన దేశం స్వతంత్ర వైఖరిని అవలంబించడానికీ ఈ ప్రపంచ శ్రేణి ఎక్స్ లెన్స్ సెంటర్లను (సీఓఈస్) ను …
Read More »ఐఎఫ్ఎఫ్ఐ 2024: వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్‌లో ప్రదర్శనకు ఆరు చలనచిత్రాలు
ఈ సంవత్సరం ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ (ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – ‘ఐఎఫ్ఎఫ్ఐ’)లో వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ లో ప్రదర్శించడానికి అధికారికంగా ఎంపిక చేసిన ఆరు అసాధారణ ఫిక్షన్ సినిమాల వివరాలను ఫిలిమ్ బజార్ ప్రకటించింది. ఎంపికైన చలన చిత్రాలు ఇవీ..: 1. త్రిబేణీ రాయ్ (నేపాలీ చిత్రం) షేప్ ఆఫ్ మోమోస్ 2. శక్తీధర్ బీర్ (బెంగాలీ చిత్రం) గాంగ్‌శాలిక్ (గాంగ్‌శాలిక్ – రివర్ బర్డ్) 3. మోహన్ కుమార్ వలసల (తెలుగు చిత్రం) ఎర్ర మందారం 4. రిధమ్ జన్వే (గద్దీ, నేపాలీ చిత్రం) కాట్టీ రీ రాట్టీ 5. సిద్ధార్థ్ బాడీ (మరాఠీ చిత్రం) ఉమాల్ …
Read More »‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం మన వరిష్ఠ సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల ధైర్య సాహసాలకు, త్యాగాలకు మనమిచ్చే గౌరవం: ప్రధానమంత్రి
మన దేశ ప్రజల ప్రాణాలను రక్షించే కర్తవ్య పాలనలో మన త్రివిధ దళాల వరిష్ఠ ఉద్యోగులతో పాటు మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకు, వారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం అందించిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఓఆర్ఓపీ పథకాన్ని ప్రారంభించి నేటికి పదేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ పథకం కోసం చాలా కాలంగా ఉన్న డిమాండును నెరవేర్చడమే కాకుండా, మన వీరులకు దేశం అందిస్తున్న గౌరవంగా ఆయన పేర్కొన్నారు. మన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడం కోసం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సాధ్యమైనంతగా కృషి చేస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర …
Read More »ఛఠ్ మహాపర్వంలో సంధ్య అర్ఘ్య సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
ఛఠ్ మహాపర్వంలో పాటించే ‘సంధ్య అర్ఘ్య’ సందర్భంగా.. దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎక్స్’ లో పొందుపరిచిన ఒక సందేశం లో ప్రధాని ఇలా పేర్కొన్నారు: ‘‘ఛఠ్ మహాపర్వంలో పవిత్ర సందర్భమైన ‘సంధ్య అర్ఘ్య’ వేళ.. మీకందరికీ అనేకానేక శుభాకాంక్షలు. నిరాడంబరత్వానికీ, నిగ్రహానికీ, సంకల్పానికీ, సమర్పణకు సంకేతంగా ఉన్న ఈ మహాపర్వం ప్రతి ఒక్కరి జీవనంలో సుఖాన్నీ, సమృద్ధినీ, సౌభాగ్యాన్నీ తీసుకు రావాలని నేను కోరుకుంటున్నాను. జయ్ ఛఠీ మాతా’’
Read More »ఇండియన్ నేవీ క్విజ్ ‘థింక్ 2024’ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహణకు సన్నాహాలు పూర్తి
భారతీయ నౌకాదళం నిర్వహిస్తున్న ‘థింక్-2024’ క్విజ్ సెమీ ఫైనల్స్‌ను ఈ నెల 7న, ఫైనల్స్ ను ఈ నెల 8న ఏళిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గత జులై 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియతో మొదలైన ‘థింక్ 2024’ క్విజ్ ముగింపు దశకు చేరుకుంటున్నది. అభివృద్ధి చెందిన భారతదేశం (‘వికసిత్ భారత్’) లక్ష్యాలకు అనుగుణంగా, యువతీ యువకులలో మేధో వికాసాన్ని కలిగించడానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్విజ్… అతి పెద్ద క్విజ్ కార్యక్రమంగా పేరుతెచ్చుకొంది. దేశంలో నలుమూలల నుంచి సెమీఫైనల్స్ కు ఎంపికైన వారంతా తుది పోటీ కోసం ఐఎన్ఏ కు చేరుకుంటున్నారు. దీంతో ఐఎన్ఏలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మొత్తం 16 పాఠశాలు సెమీ ఫైనల్స్ కు ఎంపికయ్యాయి. ఎంపికైన విద్యార్థులు వారి వెంట వచ్చిన ఉపాధ్యాయులు ఇక్కడికి చేరుకోవడంతో నిర్వాహకులు వారిని సాదరంగా …
Read More »
Matribhumisamachar
