रविवार, नवंबर 24 2024 | 10:00:45 AM
Breaking News
Home / Choose Language / telugu (page 7)

telugu

telugu

ప్ర‌ముఖ నృత్యకారుడు, సాంస్కృతిక మ‌ణిదీపం శ్రీ క‌న‌క‌రాజు మృతికి ప్ర‌ధాన‌మంత్రి సంతాపం

ప్ర‌ముఖ నృత్య‌కారుడు, సాంస్కృతిక మ‌ణిదీపం శ్రీ క‌న‌క‌రాజు మృతికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపం తెలియ‌చేశారు. గుస్సాడీ నృత్యానికి ఆయ‌న చేసిన స‌మున్న‌త‌మైన సేవ‌ల‌ను, అంకిత భావాన్ని శ్రీ మోదీ కొనియాడారు. సాంస్కృతిక వార‌స‌త్వ చిహ్న‌లేవీ వాటి స్వాభావిక స్వ‌రూపాన్ని కోల్పోకూడ‌ద‌న్న ఆయ‌న త‌ప‌న‌ను ప్ర‌శంసించారు. ఎక్స్  వేదిక‌గా శ్రీ మోదీ ఇలా రాశారు… “ప్ర‌ముఖ నృత్య‌కారుడు, సాంస్కృతిక మ‌ణిదీపం శ్రీ క‌న‌క‌రాజు మ‌ర‌ణం చాలా విచారం క‌లిగించింది. గుస్సాడీ నృత్యాన్ని …

Read More »

రాయ్ పూర్ ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు (అక్టోబర్ 25) రాయ్ పూర్ అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) రెండో స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముర్ము, తక్కువ ఖర్చులో వైద్య విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడంలో ఎయిమ్స్ సంస్థలు ముందున్నాయని ప్రశంసించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ సంస్థల్లో వైద్యం నిమిత్తం దేశం నలుమూలల నుంచీ ప్రజలు వస్తారని రాష్ట్రపతి తెలియచేశారు. సంస్థ ప్రారంభించిన కొద్ది కాలంలోనే రాయ్ పూర్ ఎయిమ్స్ మంచి పేరు తెచ్చుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సంస్థ, రానున్న …

Read More »

దానా తుఫాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం సిద్ధం

ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల వెంబడి దానా తుఫాను తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం మానవతా సహాయం, విపత్తు ఉపశమన (హెచ్ఏడీఆర్) కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని నౌకాదళ అధికారుల (ఎన్ఓఐసీ) సమన్వయంతో తూర్పు నౌకాదళ కమాండ్ సమగ్ర విపత్తు ప్రతిస్పందన కార్యాచరణను రూపొందించింది. ఆహార పదార్థాల నిల్వ యార్డు (బీవీవై), మెటీరియల్ ఆర్గనైజేషన్, నౌకాదళ ఆసుపత్రి ఐఎన్‌హెచ్ఎస్ కల్యాణి తదితర విభాగాలతో కలసి రాష్ట్ర అధికారుల విజ్ఞప్తి మేరకు అవసరమైన సామగ్రి, వైద్య సహాయం అందిస్తుంది. దీనిలో …

Read More »

దానా తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశా వద్ద తీరాన్ని దాటనున్న నేపథ్యంలో

దూసుకొస్తున్న దానా తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో, ఈశాన్య ప్రాంతపు తీర రక్షక దళం (ఐసీజీ) అప్రమత్తమైంది. దానా గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రాణ, ఆస్తి నష్టాలని నివారించేందుకు, తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు.. అనేక ముందు జాగ్రత్త చర్యలను తీసుకొంది. జాలర్లూ, సముద్ర నావికులు ఎప్పటికప్పుడు హెచ్చరించే బాధ్యతను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని నౌకలూ, విమానాలూ, రిమోట్ స్టేషన్లకు అప్పగించింది. దాంతో… సముద్రంలోని అన్ని నౌకలూ వెంటనే తీరానికి చేరుకోవాలంటూ నిరంతరాయంగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తుఫాను వల్ల ఎటువంటి అత్యవసర స్థితి …

Read More »

బ్రిక్స్ సదస్సు కోసం రష్యా వెళ్లే ముందు ప్రధాని చేసిన ప్రకటన

బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను ఆహ్వానించారని, ఈ రోజు నేను రెండు రోజుల పర్యటన నిమిత్తం కజాన్‌కు బయలుదేరుతున్నాను. ప్రపంచ అభివృద్ధి ఎజెండా, సంస్కరించిన బహుళపక్షవాదం, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, శక్తిమంతమైన సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయటం, సాంస్కృతిక, ప్రజా అనుసంధానాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చలకు ముఖ్యమైన వేదికగా అవతరించిన బ్రిక్స్‌లో సన్నిహిత భాగస్వామ్యానికి భారతదేశం విలువ ఇస్తోంది. గత ఏడాది కొత్త సభ్యదేశాల చేరిక… ప్రపంచ అభ్యున్నతి ఎజెండాను, సమ్మిళితను పెంపొందించింది. 2024 జూలైలో మాస్కోలో జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో నా …

Read More »

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అధికారిక పర్యటన

ఈ నెల 21-24 తేదీల మధ్య, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అధికారికంగా పర్యటిస్తున్నారు. అన్ని రంగాల్లో పెరుగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా, రక్షణ రంగంలో కూడా సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భారత్ యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ల మధ్య నౌకా వాణిజ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు నావికా దళాల మధ్య సహకారానికి గల అవకాశాలను ఈ పర్యటన సందర్భంగా పరిశీలిస్తారు. యూఏఈ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ పైలట్ సయీద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్, ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారులతో అడ్మిరల్ …

Read More »

అక్టోబర్ 22న హైదరాబాద్లో “జీవన సౌలభ్యం: క్షేత్రస్థాయిలో సేవలను మెరుగుపరచటం” అనే అంశంపై పంచాయితీ సమ్మేళనాన్ని నిర్వహించనున్న పంచాయతీరాజ్ శాఖ.

హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్)లో అక్టోబర్ 22న ‘జీవన సౌలభ్యం: క్షేత్ర స్థాయిలో సేవలను మెరుగుపరచటం’ అనే అంశంపై పంచాయతీ సమ్మేళనం జరగనుంది.  పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్, ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీ. నరేంద్ర కుమార్, పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ …

Read More »

‘‘స్కామ్ సే బచో’’ ప్రచార ఉద్యమం కోసం చేతులు కలిపిన ప్రభుత్వం, మెటా; పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అడ్డుకోవడానికే ఈ ఉద్యమం

‘‘స్కామ్ సే బచో’’ (‘మోసం బారిన పడకండి’) పేరుతో ఒక జాతీయ వినియోగదారుల  చైతన్య బోధక ప్రచార ఉద్యమాన్ని న్యూ ఢిల్లీ లో ఈ రోజు ప్రారంభించారు. సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు. మెటా సంస్థ ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞానం మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై), హోం శాఖ (ఎమ్‌హెచ్ఏ), సమాచార, ప్రసార శాఖ …

Read More »