గయానాలో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని స్టేట్ హౌస్ లో ఈ రోజున నిర్వహించిన ఒక కార్యక్రమంలో గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ఇర్ఫాన్ అలీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేశారు. ఆయన చూపుతున్న రాజనీతిజ్ఞతకూ, అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులను సమర్ధిస్తున్నందుకూ.. ప్రపంచానికి అపూర్వ సేవలను అందిస్తున్నందుకూ, భారత- గయానా సంబంధాలను బలోపేతం చేస్తున్నందుకూ గుర్తింపుగా ‘ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ప్రదానం చేశారు.
ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి స్వీకరిస్తూ… తనకు లభించిన ఈ సత్కారాన్ని భారతదేశ ప్రజలతో పాటు భారత ప్రజలకూ, భారత-గయానా ప్రజల మధ్య ఏర్పడిన సత్సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. గయానాలో తాను ఆధికారికంగా పర్యటించడం… భారత-గయానా మైత్రిని మరింత శక్తిమంతం చేసేందుకు భారతదేశం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
గయానా అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాలుగో విదేశీ నేత కావడం విశేషం.