मंगलवार, दिसंबर 03 2024 | 01:35:38 AM
Breaking News
Home / Choose Language / telugu / సుప్రీంకోర్టు, హైకోర్టుల విచారణలు, తీర్పుల అనువాదం, ప్రచురణకు చర్యలు

సుప్రీంకోర్టు, హైకోర్టుల విచారణలు, తీర్పుల అనువాదం, ప్రచురణకు చర్యలు

Follow us on:

న్యాయపరమైన పత్రాల అనువాదంలో కృత్రిమ మేధ (ఏఐ) భాషా సాంకేతికత వినియోగాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. 2023 ఫిబ్రవరి నుంచి జరిగిన మౌఖిక వాదనల భాషాంతరీకరణలో, ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసనాల విషయంలోనూ కృత్రిమ మేధను వినియోగించారు. ముఖ్యమైన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల స్థానిక భాషా అనువాదాన్ని పర్యవేక్షించడానికి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ అనువాద ప్రక్రియను వేగవంతం చేయడం కోసం గౌరవ న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ఉప కమిటీలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోంది.

సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల స్థానిక భాషా అనువాదానికి సంబంధించిన మొత్తం పనిని హైకోర్టుల కృత్రిమ మేధ అనువాద కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి. 17 హైకోర్టులు ఇ-హైకోర్టు రిపోర్ట్స్ (ఇ-హెచ్ సీఆర్)/ ఇ-ఇండియన్ లా రిపోర్ట్స్ (ఇ-ఐఎల్ఆర్)ను ఇప్పటికే ప్రారంభించాయి.

అన్ని కేంద్ర, రాష్ట్ర శాసనాలు, నియమ నిబంధనలు, మొదలైన అంశాలను స్థానిక భాషల్లోకి అనువదించవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలని హైకోర్టుల కృత్రిమ మేధ అనువాద కమిటీలకు సూచనలు అందాయి. రాష్ట్ర వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచడం ద్వారా సాధారణ ప్రజలు వాటిని తమ భాషలోనే చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఇది ‘న్యాయాన్ని అందరికీ చేరువ చేయడం’లో భాగంగా ఉన్నందున.. తీర్పుల అనువాదంలో తమ హైకోర్టులకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉంది.

నవంబరు 25 నాటికి 36,316 సుప్రీంకోర్టు తీర్పులను హిందీలోకి అనువదించారు. 42,457 సుప్రీంకోర్టు తీర్పులను ఇతర 17 ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. అవి ఇ-ఎస్సీఆర్ పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి.

ఈ అనువాద ప్రాజెక్టు కోసం సుప్రీం కోర్టుకు ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయలేదు.

న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ అర్జున్ రాం మేఘ్వాల్ రాజ్యసభకిచ్చిన  ఓ లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికల ప్రస్తుత చట్టాలను పటిష్ట పరచాలి

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్ ఫాం (వేదిక)ల విషయంలో అమలవుతున్న చట్టాలను తక్షణం బలపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర …