शुक्रवार, नवंबर 22 2024 | 11:35:06 AM
Breaking News
Home / Choose Language / telugu / అల్మోడాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇస్తున్నట్టు ప్రకటన

అల్మోడాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇస్తున్నట్టు ప్రకటన

Follow us on:

ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంఓ ఇండియా ద్వారా సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

‘‘ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఇవ్వనున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

భూగర్భ జలాల అనుమతుల కోసం ‘‘భూ- నీర్’’ పోర్టల్ ను ప్రారంభించిన జల్ శక్తి మంత్రి

ఈ ఏటి ఇండియా వాటర్ వీక్ ముగింపు ఉత్సవం సందర్భంగా ‘‘భూ-నీర్’’ పోర్టల్ ను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖా మంత్రి …