रविवार, दिसंबर 22 2024 | 02:34:28 PM
Breaking News
Home / Choose Language / telugu (page 3)

telugu

telugu

స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. జి20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇది వరకు న్యూఢిల్లీలో నిర్వహించినప్పుడు 2030కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు, ఇంధన సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జి20 తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు.  స్థిరాభివృద్ధి సాధనకు సంబంధించిన ఈ ప్రాథమ్యాలను ముందుకు తీసుకు పోవాలని బ్రెజిల్ నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు. అభివృద్ధి సాధనను దీర్ఘకాలం కొనసాగించే దిశగా భారతదేశం తీసుకున్న నిర్ణయాలను ప్రధాని వివరించారు. భారతదేశం గత పదేళ్ళలో 4 కోట్ల కుటుంబాలకు గృహ వసతినీ, గడచిన అయిదేళ్ళలో 12 కోట్ల …

Read More »

పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, ఇంకా డేటాల వినియోగంపై ప్రకటన

ప్రపంచ వృద్ధి 3 శాతాని కంటే కాస్త ఎక్కువ మాత్రమే నమోదయింది. ఇది ఈ శతాబ్దం మొదలైన తరువాత నుంచి చూస్తే అత్యంత తక్కువ. మహమ్మారికి ముందు కాలంలో ఇది సగటున సుమారు 4 శాతం గా ఉండింది. దీనికి తోడు, టెక్నాలజీ ఊహించినదాని కంటే వేగంగా వెళుతోంది. టెక్నాలజీని సమాన స్థాయిలలో న్యాయబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా వృద్ధిని పెంచడానికీ, అసమానతలను తగ్గించడానికీ, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) సాధనలో అంతరాన్ని పూడ్చే దిశలో ఒక పెద్ద అడుగు వేయడానికీ ఒక చరిత్రాత్మక అవకాశాన్ని మనకు అందిస్తుంది. స్థిరాభివృద్ధి లక్ష్యాల బాటలో వేగంగా సాగిపోవడానికి డిజిటల్ మార్పును అన్నిటా …

Read More »

ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

బ్రెజిల్‌లోని రియో డి జెనీరో లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాదిలో ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇది మూడోసారి. జనవరిలో భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అధ్యక్షుడు మాక్రోన్ హాజరయ్యారు. అనంతరం జూన్‌లో ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంలోనూ ఇద్దరూ సమావేశమయ్యారు. 2047 ప్రణాళిక, ఇతర ద్వైపాక్షిక ప్రకటనల్లో తెలిపినట్లుగా భారత్ – ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు …

Read More »

బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ

బ్రెజిల్ రియో డి జెనీరో జి-20 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిటిష్ ప్రధాని సర్ కెయిర్ స్టార్మర్ తో భేటీ అయ్యారు. ఇరుదేశాల ప్రధానులూ సమావేశమవడం ఇదే  తొలిసారి. బ్రిటన్ అధికార పగ్గాలు చేపట్టినందుకు శ్రీ మోదీ సర్  స్టార్మర్ కు అభినందనలు తెలియచేశారు. మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన శ్రీ మోదీకి బ్రిటన్ ప్రధానమంత్రి శుభాకాంక్షలు అందజేశారు. ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక …

Read More »

నార్వే ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టోర్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని ప్రధానులు ఇద్దరూ సమీక్షించారు. వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలపరచుకోదగ్గ పద్ధతులపైనా వారు చర్చించారు. ఇండియా – యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ – ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (ఇండియా-ఈఎఫ్‌టీఏ – టీఈపీఏ) కుదరడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కీలక ఘట్టమని వారు అభిప్రాయపడ్డారు. నార్వే సహా ఈఎఫ్‌టీఏ సభ్య …

Read More »

పోర్చుగల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా పోర్చుగల్ ప్రధాని శ్రీ లుయిస్ మోంటెనెగ్రో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇది ఈ నేతలిద్దరికి తొలి సమావేశం. గత ఏప్రిల్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి, విస్తరింపచేసుకోవడానికి కలసి పని చేయాలని శ్రీ మోదీ …

Read More »

ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన  జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ …

Read More »

ఇటలీ-ఇండియా ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029

శక్తిమంతమైన ఇండియా-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉమ్మడి కార్యాచరణ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ నిర్ణయించారు. నవంబరు 18న బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జరిగిన జీ-20 సమావేశానికి హాజరైన సందర్భంగా వారిరువురూ భేటీ అయ్యారు. మరింత స్పష్టతతో, నిర్ణీత సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావించారు. ఇందుకోసం …

Read More »

పువ్వుల్లో పుప్పొడి అభివృద్ధి, గింజల రూపకర్తను గుర్తించిన శాస్త్రవేత్తలు

మొక్కల్లోని పురుష పునరుత్పత్తి వ్యవస్థ, పుప్పొడి, విత్తన తయారీలో కీలకపాత్రను పోషిస్తున్న ఒక కొత్త జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. పుష్పించే జాతి అరాబిడోస్ కు చెందిన క్యాబేజీ, ఆవాల మొక్కల్లో ఈ జన్యువును గుర్తించారు. పంట ఫలదీకరణ, విత్తన ఉత్పత్తినీ మరింత మెరుగుపరిచేందుకు ఈ పరిశోధనా ఫలితాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. మొక్క జీవనచక్రంలో- పుప్పొడి తయారీ చాలా ముఖ్యమైన దశ. దీనినే పురుష గ్యామెటోఫైట్ దశగా పేర్కొంటారు. అండాశయానికి జన్యు …

Read More »

నైజీరియా అధ్యక్షునితో అధికారిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 17, 18 తేదీల్లో తన నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో అబుజాలో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు. స్టేట్ హౌస్‌కు చేరుకున్న అనంతరం ప్రధానికి 21 తుపాకులతో గౌరవ వందనంతో లాంఛనంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతల మధ్య నియంత్రిత సమావేశం జరిగిన అనంతరం ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. న్యూ ఢిల్లీలో …

Read More »