‘‘స్కామ్ సే బచో’’ (‘మోసం బారిన పడకండి’) పేరుతో ఒక జాతీయ వినియోగదారుల చైతన్య బోధక ప్రచార ఉద్యమాన్ని న్యూ ఢిల్లీ లో ఈ రోజు ప్రారంభించారు. సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు.
మెటా సంస్థ ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞానం మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై), హోం శాఖ (ఎమ్‌హెచ్ఏ), సమాచార, ప్రసార శాఖ (ఎమ్ఐబీ), ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వంటి కీలక మంత్రిత్వ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకొని, తీసుకు వచ్చింది. ఇంటర్‌నెట్ జగతిలో రోజు రోజుకూ పెచ్చు పెరుగుతున్న మోసాలతో, సైబర్ లోకంలో దగాలతో పోరాడడం, ఆన్‌లైన్ స్కామ్ కేసులను పరిష్కరిస్తూ సైబర్ సంబంధిత భద్రతను పెంపొందింప చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ముందుకు పోవడం ఈ కార్యక్రమం ధ్యేయాలుగా ఉన్నాయి.
మెటా అమలుచేయనున్న ‘స్కామ్ సే బచో’ ప్రచార ఉద్యమానికి శ్రీ సంజయ్ జాజు మద్దతును ప్రకటిస్తూ, నేటి కాలంలో అంతకంతకు పెరిగిపోతున్న ఆన్‌లైన్ స్కామ్ ల బెదరింపు బారి నుండి పౌరులను కాపాడే దిశలో ఇది సరి అయిన కాలంలో తీసుకొన్న, చాలా ప్రాముఖ్యం ఉన్న చర్య అన్నారు. డిజిటల్ రంగంలో భద్రతను, నిఘాను పెంచడం కోసం యావత్ ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తూ ఉంటుందన్నా విషయాన్ని ఈ చర్య చాటిచెబుతుందని ఆయన అన్నారు.
సాంకేతిక విజ్ఞాన రంగంలో నిత్యం అనేక ప్రగతి ప్రధానమైన పరిణామాలు చోటుచేసుకొంటున్న నేపథ్యంలో, సైబర్ సెక్యూరిటీకి ఎదురవుతున్న సవాళ్ళను దీటుగా ఎదుర్కోనున్న భారత్
దేశంలో తొంభై కోట్ల కు పైచిలుకు ప్రజానీకం ఇంటర్‌నెట్ ను వాడుతున్నారని, డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా అసాధారణమైన డిజిటల్ వృద్ధి చోటుచేసుకొంటోందని, తత్ఫలితంగా యూపీఐ ఆధారిత లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్న ప్రపంచదేశాల్లో ఒక దేశం గా భారత్ ఎదిగిందని సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఈ కార్యక్రమంలో ప్రముఖంగా ప్రస్తావించారు.
అయితే, ఈ పురోగతి తో పాటే సైబర్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయని, కిందటి ఏడాది పదకొండు లక్షల ఆన్ లైన్ మోసానికి సంబంధించిన కేసులు తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ ముప్పులను నివారించడానికి తగిన తీవ్ర చర్యలను తీసుకోవాలని, డిజిటల్ మాధ్యమ వినియోగదారులలో అవగాహనను పెంచాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
సైబర్ బెదిరింపులకు లొంగకుండా అవసరమైన జాగ్రత్త చర్యలను గురించి పౌరులకు తెలియజేయడం: ‘స్కామ్ సే బచో’ ఉద్యమం అంటే ఇదే
‘స్కామ్ సే బచో’ (మోసం నుంచి కాపాడుకోండి) ప్రచార ఉద్యమం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, అంతకు మించిన ఉద్యమం అని సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఈ ముప్పుల బారి నుండి భారత పౌరులను వారంతట వారే రక్షించుకోగలిగిన శక్తిని వారికి అందించే ఒక జాతీయ ఉద్యమంగా ఈ ప్రచార కార్యక్రమం పేరు తెచ్చుకోగలుగుతుంది అని ఆయన అన్నారు. డిజిటల్ మాధ్యమంలో సురక్షను, నిఘాను ప్రోత్సహించాలనేదే మా శక్తిమంతమైన లక్ష్యం. ‘‘వివిధ దేశాలలో మెటా సంస్థ సంపాదించిన విస్తృత అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రచార ఉద్యమం దేశంలో ప్రతి ఒక్కరికీ సైబర్ ముప్పుల వలలో చిక్కుకోకుండా వారిని వారే కాపాడుకొనే సత్తాను సమకూర్చి, డిజిటల్ రంగంలో మనం సాధిస్తున్న ప్రగతితో పాటే ఒక పటిష్ట డిజిటల్ భద్రత వ్యవస్థను నెలకొల్పుతుంద’’ని’ శ్రీ సంజయ్ జాజు అన్నారు.