गुरुवार, नवंबर 21 2024 | 10:51:45 PM
Breaking News
Home / Choose Language / telugu / ఇటలీ-ఇండియా ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029

ఇటలీ-ఇండియా ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029

Follow us on:

శక్తిమంతమైన ఇండియా-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉమ్మడి కార్యాచరణ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ నిర్ణయించారు. నవంబరు 18న బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జరిగిన జీ-20 సమావేశానికి హాజరైన సందర్భంగా వారిరువురూ భేటీ అయ్యారు. మరింత స్పష్టతతో, నిర్ణీత సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావించారు. ఇందుకోసం వారు వ్యూహాత్మక కార్యాచరణకు రూపకల్పన చేశారు.

I. రాజకీయ చర్చలు

a. బహుముఖీనమైన కార్యక్రమాలకు తోడు, తరచూ ఇరుదేశాల దేశాధినేతలు, విదేశాంగ మంత్రులు, వాణిజ్యం, రక్షణ స్థాయుల్లో సమావేశాలూ పరస్పర పర్యటనలు క్రమం తప్పకుండా కొనసాగించాలి.

b. ఉత్తరప్రత్యుత్తరాలతోపాటు ఇరుదేశాల విదేశాంగ శాఖ సీనియర్ అధికారుల స్థాయిలో వార్షిక ద్వైపాక్షిక సమావేశాలను కొనసాగించాలి.

c. ఉభయుల అవసరాల ప్రాతిపదికగా మంత్రిత్వ శాఖల అధిపతుల స్థాయిలో సమావేశాల సంఖ్యను పెంచడం ద్వారా మరింత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి.

II. ఆర్ధిక సహకారం, పెట్టుబడులు

a. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునేందుకూ, మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకూ, పెట్టుబడుల దిశగా… ఆహారశుద్ధిపై ఏర్పాటు చేసిన ఇటలీ-ఇండియా ఉమ్మడి కార్యాచరణ బృందం, ఆర్థిక సహకారంపై ఏర్పాటు చేసిన ఉమ్మడి కమిషన్లకు మరింత సహకారాన్ని అందించాలి. రవాణా, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు, రసాయన-ఔషధాల తయారీ, కలప, కలపతో చేసిన సామగ్రి, కొత్త సాంకేతికత రంగం, ఆహార శుద్ధి, ప్యాకేజింగ్, కోల్డ్ చెయిన్, పర్యావరణ హిత సాంకేతికతలు, లాభదాయక రవాణా రంగం, ఉభయదేశాల అభివృద్ధి, ఉమ్మడి తయారీ రంగం, పెద్ద కంపెనీలతో జాయింట్ వెంచర్లు, ఎస్ఎంఈలూ… అంశాలపై దృష్టిపెట్టాలి.

b. వాణిజ్య సంఘాలు, పరిశ్రమ, ఆర్థిక సంఘాలను భాగస్వాములుగా చేయడం ద్వారా వాణిజ్య ప్రదర్శనలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించాలి.

c. ఆటోమోటివ్ పరిశ్రమ, సెమీకండక్టర్లు, మౌలిక సదుపాయలు, ఆధునిక తయారీ రంగాల్లో- పరిశ్రమ స్థాయిలో భాగస్వామ్యాలు, సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించాలి.

III. అనుసంధానత

a. పర్యావరణహితపరమైన రవాణా అంశాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి.

b. ఇండియా-మధ్యప్రాచ్యం- ఐరోపా ఆర్ధిక కారిడార్ (ఐఎంఈఈసీ) పరిధిలో- నౌకా వాణిజ్యం, భూతల మౌలిక సదుపాయాల దిశగా సహకారాన్ని పెంపొందించాలి. నౌకా వాణిజ్యం, నౌకాశ్రయాల పరంగా ఏర్పాటు చేసుకోదలచిన ఒప్పందాన్ని పూర్తి చేయాలి.

IV. శాస్త్ర సాంకేతిక రంగం, ఐటీ, ఆవిష్కరణలు, అంకుర సంస్థలు

a. టెలికం, కృత్రిమ మేధ, సేవల డిజటలీకరణ అంశాల్లో… ఇరుదేశాల్లో కీలకమైన, ఆధునిక సాంకేతికతల విషయంలో సహకరించుకోవడం, సాంకేతికంగా ఉన్నతమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం.

b. పరిశ్రమ 4.0 లో… ఇరుదేశాల్లోనూ సహకారానికి కొత్త మార్గాల అన్వేషణ, అత్యాధునిక తయారీ ప్రక్రియలు, హరిత ఇంధనం, కీలక ఖనిజాల అన్వేషణ, కీలక ఖనిజాల శుద్ధి, విద్యాసంస్థలను, పరిశ్రమలను భాగస్వాములుగా చేయడం, ఎస్ఎంఈలనూ, అంకుర సంస్థలను కూడా భాగస్వాములుగా చేయడం.

c. ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతాల  కార్యాచరణ (ఐపీఓఐ) పరిధిలో ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత, ఇటలీ దేశాల్లో పరిశోధనా ప్రాథమ్యాలను గుర్తించడం, ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందించడం, పరిశోధన పరంగా సంయుక్తంగా కలిసి పనిచేయడం.

d. విద్యాపరంగా, పరిశోధనల పరంగా- స్టెమ్ పరిధిలో పరిశోధనావకాశాలను గుర్తించడం, స్కాలర్ షిప్పులకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, ప్రధాన శాస్త్ర సాంకేతిక సంస్థలు సంయుక్తంగా కలిసి పరిశోధనలు చేయడం, ఉమ్మడి ప్రాజెక్టులపై దృష్టి సారించడం.

e. ఫిన్ టెక్, ఎడ్యుటెక్, ఆరోగ్య రంగాలు, రవాణా వ్యవస్థలు, సరఫరా వ్యవస్థలు, ఆగ్రిటెక్, చిప్ డిజైన్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అంకుర సంస్థల మధ్య సమన్వయం, ఇరుదేశాల్లోనూ ఆవిష్కరణ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం.

f. ఇండో- ఇటాలియన్ ఆవిష్కరణలకు కార్యాచరణను ప్రారంభించడం, ఆవిష్కరణలకు దారితీసే ప్రాథమిక క్రియలను ప్రోత్సహించడం, ఉమ్మడి నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవడం, విద్యాసంస్థలు-పరిశోధనా సంస్థల్లో ఇంక్యుబేషన్ వాతావరణాన్ని కల్పించడం.

g. సహకారానికి సంబంధించి ఇప్పటి వరకూ జరిగిన ప్రయాణాన్ని గుర్తిస్తూనే, కొత్తగా ఏర్పాటు చేసుకునే ద్వైపాక్షిక సంబంధాల ద్వారా సహకార కార్యక్రమాలను బలోపేతం చేయడం.

h. 2025-27 సంవత్సరాల్లో శాస్త్ర సాంకేతిక సహకారానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేయడం. రెండు దేశాల్లో నిర్వహించడానికి వీలైన కీలకమైన పరిశోధనా ప్రాజెక్టుల ద్వారా దీనిని రానున్న ఏడాదిలోనే అమల్లోకి తేవడం.

V. అంతరిక్ష రంగం

a. చంద్రుడికి సంబంధించిన సైన్సుకి ప్రధమ ప్రాథమ్యం ఇస్తూ… భూ పరిశీలన, హీలియో ఫిజిక్స్, అంతరిక్ష పరిశోధనల రంగంలో ఇటలీ అంతరిక్ష సంస్థ (ఏఎస్ఐ), ఇస్రోల మధ్య సహకారాన్ని విస్తృతం చేయాలి.

b. అంతరిక్ష ప్రాంతాన్ని శాంతి ప్రయోజనాలకు ఉపయోగించుకునే దిశగా- దృక్కోణం, పరిశోధన, అభివృద్ధి అంశాల్లో సహకారం.

c. పెద్ద పెద్ద పరిశ్రమలను, ఎంఎస్ఎంఈలను, అంకుర సంస్థలనూ భాగస్వాములుగా చేయడం ద్వారా వాణిజ్య అంతరిక్ష ప్రాజక్టుల విషయంలో ఉభయతారకంగా ఉండే వాటిని గుర్తించడం, వాటిని కార్యాచరణ దిశగా నడిపించడం.

d. వాణిజ్య భాగస్వామ్యం, పరిశోధనలు, అంతరిక్ష పరిశోధనల దృష్టితో ఇటలీ అంతరిక్ష పరిశ్రమకు చెందిన ప్రతినిధులను 2025 మధ్య ప్రాంతంలో దేశానికి తీసుకుని రావడం.

VI. ఇంధనాల మార్పు

a. ఇరుదేశాల్లోని పరిశ్రమలకు చెందిన వాతావరణానికి సంబంధించిన అవగాహనను ప్రోత్సహించడం, సాంకేతిక సదస్సుల ద్వారా మంచి ఆచరణలనూ, అనుభవాలనూ పరస్పరం పంచుకోవడం, తద్వారా పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను ఏర్పరచడం.

b. సాంకేతికపరంగా ఆధునికతకు పెద్దపీట వేయడం, పరిశోధన అభివృద్ధిపరంగా కలిసి పనిచేయడం.

c. గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, పునరుత్పాదనలు, వృథా లేని ఇంధన వినియోగం వంటి అంశాలపరంగా సహకరించుకునేందుకు- సంప్రదాయేతర ఇంధనంపై ఏర్పాటు చేసిన ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని మరింత క్రియాశీలం చేయడం.  d. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణల్లో పరస్పర సహకారం పెంపు.

e. అన్ని రంగాల్లో సంబంధాల బలోపేతం, పర్యాటకానికి పెద్దఎత్తున ప్రోత్సాహం.

f. ఇరుదేశాల మధ్య చిరకాలంగా నెలకొన్న సాంస్కృతిక బంధాలు, స్నేహ సంబంధాలను నిలిపి ఉంచడంలో భారత, ఇటలీ పౌరుల పాత్రను గుర్తించడం.

g. 2023లో కుదిరిన సాంస్కృతిక సహకార బృహత్ ప్రణాళిక అమలు దిశగా కృషి.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

బ్రెజిల్‌లోని రియో డి జెనీరో లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాదిలో …