బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను ఆహ్వానించారని, ఈ రోజు నేను రెండు రోజుల పర్యటన నిమిత్తం కజాన్‌కు బయలుదేరుతున్నాను.
ప్రపంచ అభివృద్ధి ఎజెండా, సంస్కరించిన బహుళపక్షవాదం, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, శక్తిమంతమైన సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయటం, సాంస్కృతిక, ప్రజా అనుసంధానాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చలకు ముఖ్యమైన వేదికగా అవతరించిన బ్రిక్స్‌లో సన్నిహిత భాగస్వామ్యానికి భారతదేశం విలువ ఇస్తోంది. గత ఏడాది కొత్త సభ్యదేశాల చేరిక… ప్రపంచ అభ్యున్నతి ఎజెండాను, సమ్మిళితను పెంపొందించింది.
2024 జూలైలో మాస్కోలో జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో నా కజాన్ పర్యటన భారత్, రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
బ్రిక్స్ దేశాలకు చెందిన ఇతర నేతలను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.