ఈ నెల 21-24 తేదీల మధ్య, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అధికారికంగా పర్యటిస్తున్నారు. అన్ని రంగాల్లో పెరుగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా, రక్షణ రంగంలో కూడా సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భారత్ యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ల మధ్య నౌకా వాణిజ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు నావికా దళాల మధ్య సహకారానికి గల అవకాశాలను ఈ పర్యటన సందర్భంగా పరిశీలిస్తారు.
యూఏఈ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ పైలట్ సయీద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్, ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారులతో అడ్మిరల్ త్రిపాఠీ చర్చల్లో పాల్గొంటారు. యూఏఈ జాతీయ రక్షణ సంస్థను సందర్శించి, విద్యార్థి నాయకులతో సంభాషిస్తారు. పర్యటనలో భాగంగా భారత్- యూఏఈ నౌకాదళ మూడో సంచిక సంయుక్త విన్యాసాల కార్యక్రమానికి హాజరవుతారు.
భారత్-యూఏఈ సంయుక్తంగా చేపడుతున్న ముఖ్య కార్యక్రమాల్లో పోర్టు కలయికలు, సంయుక్త విన్యాసాలూ, పరస్పర పర్యటనలూ, ఇరు దళాల సిబ్బంది మధ్య చర్చలూ, సంయుక్త రక్షణ సహకార కమిటీ- జేడీసీసీ భాగంగా ఉన్నాయి.