शनिवार, नवंबर 23 2024 | 02:03:44 PM
Breaking News
Home / Choose Language / telugu / “వీర సావర్కర్ అసలు చరిత్ర చెప్పాలని నాకుగా నేను నిశ్చయించుకున్నా…”: రణదీప్ హూడా

“వీర సావర్కర్ అసలు చరిత్ర చెప్పాలని నాకుగా నేను నిశ్చయించుకున్నా…”: రణదీప్ హూడా

Follow us on:

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘ఇండియన్ పనోరమా’ విభాగంలో ప్రారంభ చిత్రంగా స్వాతంత్ర్య వీర సావర్కర్  చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం, ‘జీవిత చరిత్ర’ జానర్ కు చెందిన ఈ  చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది మీడియాతో ముచ్చటించారు. సినిమా నిర్మాణంలోని సృజనాత్మక అంశాలనూ, సినిమా చారిత్రిక ప్రాముఖ్యాన్ని విశ్లేషించేందుకు ఈ కార్యక్రమం చక్కని వేదికయ్యింది.

సినిమా దర్శకుడూ, కథానాయకుడూ, వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్ర పోషించిన రణదీప్ హూడా మాట్లాడుతూ… స్వాతంత్ర్య పోరులో సావర్కర్ ఎదుర్కొన్న కష్టాల వంటివి సినిమా నిర్మాణ సమయంలో తానూ ఎదుర్కొన్నానని చెప్పారు. చరిత్ర పుటల్లో సముచిత స్థానం దక్కని స్వాతంత్ర్య యోధుడు వీర సావర్కర్ అసలైన చరిత్రను తెలియజెప్పాలన్న బలమైన నిశ్చయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు రణదీప్ హూడా వెల్లడించారు. “దేశం సైనికపరంగా బలంగా ఉండాలని సావర్కర్ కోరుకునేవారు. ఆయన ఆకాంక్షించిన విధంగానే ఈరోజున ప్రపంచంలో మన స్థానం ఎంతో మెరుగ్గా ఉంది. మన సాయుధ పోరాటాలని విభిన్న కోణంలో చూపిన ఈ సినిమా, విప్లవకారులు ఆయుధాలు చేతపట్టేందుకు ప్రేరేపించిన పరిస్థితులని కళ్ళకు కడుతుంది” అని అన్నారు.

సినిమాలో ‘భీకాజీ కామా’ పాత్ర పోషించిన నటి అంజలి హూడా ప్రసంగిస్తూ, సినిమా వల్ల సావర్కర్ వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. “ఈ సినిమా నాకు తెలియని ఒక గొప్ప జీవితాన్ని గురించి అవగాహన కలిగించింది. చరిత్ర మరిచిన మన స్వాతంత్ర్య వీరుల గురించిన మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

పాత్రికేయ సమావేశంలో జై పటేల్, మృణాల్ దత్త్, అమిత సియాల్ కూడా పాల్గొన్నారు. సావర్కర్ చిత్రానికి సంబంధించి తమ అనుభవాలు, అనుభూతులను పంచుకుంటూ.. భారతీయ చలన చిత్ర రంగానికి ఇటువంటి సినిమాల అవసరం ఎంతో ఉందన్నారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నప్పటికీ అనామకంగా మిగిలిపోయిన అసంఖ్యాక వీరుల కథల్లో ఒకటైన వీర సావర్కర్ చరిత్రను ఈ సినిమా ఆవిష్కరించింది. మాతృభూమి పట్ల అపరిమితమైన భక్తి కలిగిన సావర్కర్, స్వతంత్ర్య పోరాటంలో ఎదుర్కొన్న విపరీత పరిణామాలను ఈ సినిమా మనసుకు హత్తుకునే రీతిలో చూపింది.

స్వాతంత్ర్య వీర సావర్కర్ ఇతివృత్తం

భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన విప్లవ భావాల యువకుడు, కవి, వినాయక దామోదర్ సావర్కర్ జీవిత కథే ఈ సినిమా. ఈ ప్రయాణంలో సాయుధ పోరాట బాట వైపు ఆయన అడుగులు, సైద్ధాంతిక సంఘర్షణలు, సెల్యులార్ జైలులో సుదీర్ఘ శిక్షా కాలం వంటి అనేక కోణాలను ఈ సినిమా చర్చించింది. ఎన్నో వ్యక్తిగత త్యాగాలు, వ్యూహాత్మక నాయకత్వాల చలవతో సావర్కర్ బలమైన నాయకుడిగా ఎదిగిన వైనాన్ని చూపిన సినిమా.. ఆయన వ్యక్తిత్వంలోని సంక్లిష్టతలని సైతం చూపుతుంది. స్వావలంబన కలిగిన బలమైన దేశంగా భారత్ ఎదగాలన్న ఆయన ఆశయం.. నేటికీ దేశంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.

నటీనటులు, సాంకేతిక బృందం:  

దర్శకత్వం: రణదీప్ హూడా

నిర్మాతలు: ఆనంద్ పండిట్, శామ్ ఖాన్, సందీప్ సింగ్, యోగేష్ రాహర్

స్క్రీన్ ప్లే : రణదీప్ హూడా  

నటీనటులు:

·         రణదీప్ హూడా

·         అంకితా లోఖండే

·         అమిత్ సియాల్

·         మృణాల్ దత్తా

·         జై పటేల్

·         అంజలీ హూడా

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటైన లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి …