ముఖ గుర్తింపు సాంకేతికత (ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ) ద్వారా పింఛనుదారులు ‘లైఫ్ సర్టిఫికెట్’ సమర్పణను క్రమబద్ధీకరించడానికి, కేంద్ర పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూ) ఈ నెలలో దేశవ్యాప్తంగా ‘డీఎల్‌సీ ప్రచారం 3.0’ను నిర్వహిస్తోంది. ఈ సాంకేతికతతో, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఆధార్-ఆధారిత గుర్తింపు ద్వారా పింఛనుదారులు తన జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు. గతంలో, పింఛనుదారులు పింఛను ఇచ్చే కార్యాలయాలకు వెళ్లవలసివచ్చేది. ఇది వృద్ధులకు ఇబ్బందిగా ఉండేది. 2014లో, డీవోపీపీడబ్ల్యూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌లు (జీవన్ ప్రమాణ్), ముఖ గుర్తింపు సాంకేతికతను 2021లో ప్రవేశపెట్టింది. ఈ నూతన …
Read More »