शनिवार, नवंबर 09 2024 | 07:29:49 AM
Breaking News
Home / Choose Language / telugu / ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం మన వరిష్ఠ సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల ధైర్య సాహసాలకు, త్యాగాలకు మనమిచ్చే గౌరవం: ప్రధానమంత్రి

‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం మన వరిష్ఠ సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల ధైర్య సాహసాలకు, త్యాగాలకు మనమిచ్చే గౌరవం: ప్రధానమంత్రి

Follow us on:

మన దేశ ప్రజల ప్రాణాలను రక్షించే కర్తవ్య పాలనలో మన త్రివిధ దళాల వరిష్ఠ ఉద్యోగులతో పాటు మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకు, వారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం అందించిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఓఆర్ఓపీ పథకాన్ని ప్రారంభించి నేటికి పదేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ పథకం కోసం చాలా కాలంగా ఉన్న డిమాండును నెరవేర్చడమే కాకుండా, మన వీరులకు దేశం అందిస్తున్న గౌరవంగా ఆయన పేర్కొన్నారు. మన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడం కోసం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సాధ్యమైనంతగా కృషి చేస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఓఆర్ఓపీని అమల్లోకి తీసుకువచ్చింది ఈ రోజే. దేశ ప్రజలను కాపాడడానికి జీవితాలను అంకితం చేసే మన సైన్యంలోని వరిష్ఠ ఉద్యోగులు, మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకు, త్యాగాలకు ఇది ఒక ప్రత్యేక గౌరవం. ఓఆర్ఓపీ అమలుచేయాలంటూ చాలా కాలంగా డిమాండు ఉంది. ఆ డిమాండును నెరవేర్చి, మన వీరులకు మన దేశ ప్రజలు ఎంతటి కృతజ్ఞతా భావంతో ఉన్నదీ పునరుద్ఘాటించేందుకు తీసుకొన్న ఒక ముఖ్య నిర్ణయం- ఓఆర్ఓపీ.

‘గత పదేళ్ళలో లక్షల కొద్దీ పించనుదారులకు, పించనుదారుల కుటుంబాలకూ లబ్ధి చేకూర్చడం ద్వారా ఈ పథకం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. అంకెల్ని పక్కన పెడితే, మన సాయుధ దళాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉన్నదీ ఓఆర్ఓపీ చాటిచెబుతున్నది. మన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడానికీ, మరి మనకు సేవలను అందిస్తున్న వారి సంక్షేమాన్ని మరింతగా పెంచడానికి సాధ్యమయ్యే సకల ప్రయత్నాలను మేం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. #OneRankOnePension’’

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ఇండియన్ నేవీ క్విజ్ ‘థింక్ 2024’ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహణకు సన్నాహాలు పూర్తి

భారతీయ నౌకాదళం నిర్వహిస్తున్న ‘థింక్-2024’ క్విజ్ సెమీ ఫైనల్స్‌ను ఈ నెల 7న, ఫైనల్స్ ను ఈ నెల 8న ఏళిమలలోని  ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గత జులై 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియతో మొదలైన ‘థింక్ 2024’ క్విజ్ ముగింపు దశకు చేరుకుంటున్నది. అభివృద్ధి చెందిన భారతదేశం (‘వికసిత్ భారత్’) లక్ష్యాలకు అనుగుణంగా, యువతీ యువకులలో …