జైనాచార్య రత్నసుందర్ సురీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. సామాజిక సేవకు, ఆధ్యాత్మిక వాదానికి జైనాచార్య రత్నసుందర్ సురీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్ అందిస్తున్న తోడ్పాటును ప్రధాని ప్రశంసించారు.
‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ధులేలో, జైనాచార్య రత్నసుందర్ సురీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్ ను కలుసుకున్నాను. సామాజిక సేవకు, ఆధ్యాత్మిక వాదానికి ఆయన అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయం. అనేక విషయాలపై విస్తృతంగా ఆయన రాసిన రచనలు ప్రశంసలకు నోచుకొన్నాయి’’