రష్యన్ ఫెడరేషన్ తొలి ఉప ప్రధానమంత్రి హెచ్.ఇ. డేనిస్ మంతురోవ్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
వాణిజ్య, ఆర్థిక సంబంధాలు, ఇంధనం, అనుసంధానం సహా పలు రంగాల్లో సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై వారు చర్చించారు.
ఇటీవలి తన రష్యా పర్యటన, అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు కోసం.. భారత్ – రష్యా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు బృందాలు చేస్తున్న నిరంతర, సమష్టి కృషిని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు.
అధ్యక్షుడు పుతిన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మోదీ.. ఆయనతో చర్చల కొనసాగింపు కోసం ఎదురుచూసినట్లుగా పేర్కొన్నారు.