शनिवार, नवंबर 23 2024 | 10:28:02 AM
Breaking News
Home / Choose Language / telugu / ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో నేరుగా భావాలను పంచుకునేందుకు ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ యువతకు గొప్ప అవకాశం

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో నేరుగా భావాలను పంచుకునేందుకు ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ యువతకు గొప్ప అవకాశం

Follow us on:

యువత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం ఒక కొత్త వేదికను ప్రారంభించింది. నేషనల్ యూత్ ఫెస్టివల్ స్థానంలో 2025లో ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను ప్రారంభించనున్నారు. జాతీయాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. కవాడిగూడలోని పత్రికా సమాచార సంస్థ (పీఐబీ)లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్ వైకేఎస్), భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) ప్రతినిధులు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

2025 జనవరి 11, 12 తేదీల్లో జాతీయ యువజనోత్సవం (నేషనల్ యూత్ ఫెస్టివల్) సందర్భంగా వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ జరుగుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ ఈ వారం మొదట్లో ప్రకటించినట్లు ఎన్ వైకేఎస్ రాష్ట్ర డైరెక్టర్ ఎ.ఆర్. విజయారావు మీడియాకు తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 3,000 మంది యువనేతల మధ్య ముఖాముఖి జరగనుంది.

వికసిత భారత్ ఛాలెంజ్ అనేది నాలుగంచెల పోటీ. యువత ఇందులో పాల్గొని తమ ఆలోచనలను పంచుకోవచ్చు. 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు అఖిల భారత డిజిటల్ క్విజ్ పోటీలతో వికసిత భారత్ ఛాలెంజ్ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారంతా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. మేరా యువభారత్ (ఎంవై భారత్) వేదికగా జరిగే ఈ క్విజ్ లో భారత్ సాధించిన ప్రముఖ విజయాలపై వారి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – నేషనల్ యూత్ ఫెస్టివల్, 2025కు సంబంధించిన అన్ని వివరాలూ మేరా యువభారత్ వెబ్ సైట్ (https://mybharat.gov.in/)లో అందుబాటులో ఉంటాయి.

వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రధాన లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. రెండు ప్రధాన లక్ష్యాల ఆధారంగా ఈ యేడు జరిగే కార్యక్రమానికి ప్రణాళికను రూపొందించినట్టు శ్రీమతి విజయారావు పేర్కొన్నారు. మొదటిది- రాజకీయాల్లోకి కొత్త యువనేతలను తీసుకురావడం. రాజకీయేతర నేపథ్యం ఉన్న లక్ష మంది యువతను ఈ రంగంలో భాగస్వాములను చేయాలని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా దీనిని చేపట్టబోతున్నారు. రెండోది- పారదర్శకమైన, ప్రజాస్వామిక, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానం ద్వారా వికసిత భారత్ కోసం యువత అర్థవంతమైన సహకారాన్ని అందించేలా చూడడం.

వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముఖ్య లక్ష్యాలను వివరిస్తూ.. “యువ ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం, వికసిత భారత్ కోసం వారి ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం” అని భారత క్రీడా ప్రాధికార సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ నిషా విద్యార్థి చెప్పారు.

మూడుసార్లు ఒలింపిక్ విజేత.. అర్జున, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత ఎన్. ముఖేశ్ కుమార్, అథ్లెటిక్స్ ముఖ్య కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఎన్. రమేశ్, 2022 ఆసియా పతక విజేత నందినీ అగర్సర కూడా కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర యువతను ప్రోత్సహించారు.

రాజ్యాంగ దినోత్సవ వివరాలను శ్రీమతి విజయా రావు వెల్లడించారు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న హైదరాబాద్ సచివాలయం సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్ వైకేఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ గురించి వివరిస్తూ.. హోం మంత్రిత్వ శాఖ సహకారంతో- హైదరాబాద్ ఎన్ వైకేఎస్ నవంబరు 25 నుంచి 30 వరకు కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో 6 రోజుల కాశ్మీరీ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా యువజన అధికారి శ్రీమతి కుష్బూ గుప్త తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్, కుప్వారా, బుడ్గాం, బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా వంటి వివిధ జిల్లాలతోపాటు కాశ్మీర్ లోయ నుంచి 132 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని, తెలంగాణ ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాల గురించి తెలుసుకుంటారని ఆమె తెలిపారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటైన లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి …