క్విజ్ (ప్రశ్న, జవాబుల కార్యక్రమం)లో పాలుపంచుకోవాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువజనులు ఈ రోజు విజ్ఞప్తి చేశారు. దీనితో, చరిత్రాత్మక ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో భాగమయ్యే అవకాశం వారికి దక్కే వీలుంది. దీనితో, వికసిత్ భారత్ ను (అభివృద్ధి చెందిన భారతదేశం) ఆవిష్కరించాలనే లక్ష్యాన్ని సాధించడంలో వారు మరపురాని తోడ్పాటును అందించినట్లు కాగలదని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘నా యువ మిత్రులారా,
ఇది ఆసక్తిదాయకమైన ప్రశ్నోత్తరాలకు సంబంధించిన కార్యక్రమం. దీనిలో మీరు పాల్గొంటే, 2025 జనవరి 12న నిర్వహించనున్న చరిత్రాత్మక ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో భాగం పంచుకొనేందుకు మీకూ అవకాశం లభించవచ్చు.
మీ మీ సరికొత్త ఆలోచనలను ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలలో ఉన్న వారు తెలుసుకొనేటట్లు చేసేందుకు ఇది ఒక చాలా ప్రత్యేకమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది.
ఇది వికసిత్ భారత్‌ను ఆవిష్కరించాలనే మన లక్ష్యాన్ని సాధించడానికి మీరందించే ఒక మరపురాని తోడ్పాటు కూడా అవుతుంది.’’