బిర్సా ముండా వారసుడు శ్రీ మంగళ్ ముండా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ‘‘భగవాన్ బిర్సా ముండా వారసుడు మంగళ్ ముండా మరణం అత్యంత దు:ఖాన్ని కలిగించింది. ఆయన మృతి ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా యావత్ జార్ఖండ్ గిరిజన సమాజానికి తీరని లోటు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ …
Read More »సుప్రీంకోర్టు, హైకోర్టుల విచారణలు, తీర్పుల అనువాదం, ప్రచురణకు చర్యలు
న్యాయపరమైన పత్రాల అనువాదంలో కృత్రిమ మేధ (ఏఐ) భాషా సాంకేతికత వినియోగాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. 2023 ఫిబ్రవరి నుంచి జరిగిన మౌఖిక వాదనల భాషాంతరీకరణలో, ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసనాల విషయంలోనూ కృత్రిమ మేధను వినియోగించారు. ముఖ్యమైన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల స్థానిక భాషా అనువాదాన్ని పర్యవేక్షించడానికి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ అనువాద ప్రక్రియను వేగవంతం చేయడం కోసం గౌరవ …
Read More »ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనతో కలిసి పనిచేయనున్న ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ
ఆరోగ్య ప్రయోజనాలు, వైద్య పరమైన రక్షణ అందిస్తూ కార్మికుల సామాజిక భద్రత కోసం కృషిచేయడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంది. ‘వికసిత భారత్’ దిశగా పనిచేసేలా కార్మిక శక్తిని మరింత ఉత్పాదకంగా తీర్చిదిద్దడానికి ఇది దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మార్గదర్శకత్వంలో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య రక్షణ సదుపాయాల లభ్యతను మరింత విస్తరించేందుకు ఈఎస్ఐసీ కృషి చేస్తోంది. ఆయుష్మాన్ …
Read More »55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’
శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని పేరు పెట్టారు) ను గోవాలో నిర్వహిస్తున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ..‘ఇఫీ’) లో ముగింపు చిత్రంగా ఉంది. చాలా కాలంగా ప్రేక్షకలోకం ఆత్రంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురించి తెలియజేయడానికి పత్రికావిలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిత్రంలో పర్యావరణాన్ని …
Read More »సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికల ప్రస్తుత చట్టాలను పటిష్ట పరచాలి
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్ ఫాం (వేదిక)ల విషయంలో అమలవుతున్న చట్టాలను తక్షణం బలపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రధానంగా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో భాగంగా ఈ రోజు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ప్రసంగించారు. సంపాదకీయ నియంత్రణల నుంచి అడ్డూ అదుపూ లేని వ్యక్తీకరణల వరకు ఈ …
Read More »యువజనులారా క్విజ్‌లో పాల్గొనండి: ప్రధానమంత్రి
క్విజ్ (ప్రశ్న, జవాబుల కార్యక్రమం)లో పాలుపంచుకోవాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువజనులు ఈ రోజు విజ్ఞప్తి చేశారు. దీనితో, చరిత్రాత్మక ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో భాగమయ్యే అవకాశం వారికి దక్కే వీలుంది. దీనితో, వికసిత్ భారత్ ను (అభివృద్ధి చెందిన భారతదేశం) ఆవిష్కరించాలనే లక్ష్యాన్ని సాధించడంలో వారు మరపురాని తోడ్పాటును అందించినట్లు కాగలదని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా …
Read More »శ్రీ శశికాంత్ రూయా కన్నుమూత పట్ల ప్రధానమంత్రి సంతాపం
పారిశ్రామిక జగతిలో ఒక సమున్నత వ్యక్తి శ్రీ శశికాంత్ రూయా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. వృద్ధిలో, నూతన ఆవిష్కరణలలో ఉన్నత ప్రమాణాలను ఆయన స్థాపించారంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు: ‘‘శ్రీ శశికాంత్ రూయా పారిశ్రామిక జగతిలో సమున్నత వ్యక్తి. దూరాలోచనలు చేసిన ఆయన నాయకత్వ …
Read More »పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభోపాన్యాసం
మిత్రులందరికీ నమస్కారం! చల్లని ఆహ్లాదకర వాతావరణంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి… మనం 2024 సంవత్సరం చివరి అంకానికి చేరుకున్నాం.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు దేశం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. మిత్రులారా, ఈ సమావేశాలు ఎంతో ప్రత్యేకమైనవి, రాజ్యాంగంతో మన ప్రయాణం 75 ఏళ్ళకు చేరుకోబోతోంది. భారత రాజ్యాంగం 75 వ ఏడాదిలోకి అడుగిడనుంది. మన ప్రజాస్వామ్యానికి ఇదొక మైలురాయి. ఈ సందర్భంగా, రేపటి నుంచీ పార్లమెంటు కాన్స్టిట్యూషన్ హాల్ లో …
Read More »24 నవంబర్ 2024 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 116 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. దేశ సామూహిక కృషిపై సంభాషించే ‘మన్ కీ బాత్’ అంటే దేశం సాధించిన విజయాల సంభాషణ. ప్రజల సామర్థ్యాలపై సంభాషణ. ‘మన్ కీ బాత్’ అంటే దేశ యువత కలలు, దేశ ప్రజల ఆకాంక్షల సంభాషణ. నేను మీతో నేరుగా సంభాషించేందుకు నెలంతా ‘మన్ కీ బాత్’ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఎన్నో సందేశాలు..ఎన్నో సూచనలు. నేను వీలైనన్ని ఎక్కువ సందేశాలను చదవడానికి, మీ …
Read More »ప్రేక్షకుల ఈలలూ, చప్పట్లే… నాకు స్ఫూర్తి 55 ఇఫీలో ఖుష్బూ సుందర్ తో శివకార్తికేయన్
గోవాలోని కళా అకాడమీ… హాలు మొత్తం ఆహూతులతో నిండిపోయింది. ఇంతలో తమిళ సూపర్ స్టార్ శివకార్తికేయన్ రానే వచ్చారు. ఈలలతో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది. తెరపై కావచ్చు… తెర వెనుక కావచ్చు… శివకార్తికేయన్ రాక- ఓ పెద్ద పండగ. చిన్నగా ప్రారంభమైన శివకార్తికేయన్ ప్రయాణం… తమిళనాట సూపర్ స్టార్ గా ఎదగడంలో- పట్టువదలని విశ్వాసం, సినిమాపట్ల ఉన్న తపన, సాధించాలన్న లక్ష్యం ఉన్నాయి. 55వ భారత చలన చిత్రోత్సవం సందర్భంగా నటి, రాజకీయవేత్త అయిన ఖుష్బూ సుందర్ తో ఎలాంటి అరమరికలూ లేకుండా తన సినిమా ప్రయాణం గురించీ, తన …
Read More »