रविवार, दिसंबर 22 2024 | 08:02:38 PM
Breaking News
Home / Choose Language / telugu / ‘ఈపీఎస్’ పథకం కింద ప్రయోగాత్మకంగా నిర్వహించిన కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థను విజయవంతంగా ముగించామన్న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ

‘ఈపీఎస్’ పథకం కింద ప్రయోగాత్మకంగా నిర్వహించిన కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థను విజయవంతంగా ముగించామన్న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ

Follow us on:

పింఛను సేవలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ‘1995-ఈపీఎస్’ పథకం కింద ప్రయోగాత్మకంగా నిర్వహించిన నూతన కేంద్రీయ పింఛను చెల్లింపుల విధానం (సీపీపీఎస్) విజయవంతంగా ముగించినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ తెలియజేశారు.

అక్టోబర్ 29, 30 తేదీల్లో జమ్ము, శ్రీనగర్, కర్నాల్ ప్రాంతాలకు చెందిన 49 వేల ఈపీఎస్ పింఛనుదారులకు అక్టోబర్ నెల పింఛను సొమ్ము రూ.11 కోట్లను పంపిణీ చేయడంతో ఈ ప్రయోగాత్మక కార్యక్రమం పూర్తయిందని  మంత్రి వివరించారు.

కొత్త సీపీపీఎస్ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “నూతన కేంద్రీయ పింఛను చెల్లింపుల విధానానికి ఆమోదం లభించడం… ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో కీలక ముందడుగు. దేశంలోని ఏ బ్యాంక్ నుంచైనా, ఏ శాఖనుంచైనా పింఛన్లను పొందగలిగే సౌలభ్యం వల్ల పింఛనుదారులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పింఛను పంపిణీ వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేస్తుంది. సభ్యులకు, పింఛనుదారులకు మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్న ఈపీఎఫ్ఓ కు, నూతన సాంకేతికతలను అందించి, మరింత పటిష్టమైన సంస్థగా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యం దిశగా ఇది కీలక ముందడుగు. ఈ చర్య ద్వారా సంస్థ మరింత వేగంతో స్పందించే అవకాశం కలుగుతుంది” అన్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న వికేంద్రీకృత పింఛను పంపిణీ విధానంలో… ఈపీఎఫ్ఓ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు 3-4 స్థానిక బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుని సేవలందిస్తున్నాయి. సీపీపీఎస్ ఈ విధానాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. నూతన పద్ధతిలో పింఛను ప్రారంభమయ్యే సమయంలో ధ్రువీకరణ నిమిత్తం పింఛనుదారులు ఏ బ్యాంకునూ సందర్శించవలసిన పని లేదు. పింఛను విడుదలైన వెంటనే సొమ్ము ఖాతాల్లోకి జమ అవుతుంది.

పింఛనుదారు నివసించే ప్రాంతం మారినా, సేవలు పొందే బ్యాంక్ ని మార్చినా ‘పెన్షన్ పేమెంట్ ఆర్డర్’ ని ఇకపై ఒక కార్యాలయం నుంచీ మరో కార్యాలయానికి బదిలీ చేయించుకోవలసిన అవసరం లేదు. దాంతో దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను పొందే వీలు కలుగుతుంది. పదవీ విరమణ అనంతరం తమ సొంతూళ్లకు తిరిగివెళ్ళే వారికి కొత్త పథకం ఊరటనిస్తుంది.

ఈపీఎఫ్ఓ నవీకరణలో భాగంగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టం-సీఐటీఈఎస్ 2.01’ ప్రాజెక్టు, 2025 జనవరి నాటికి పూర్తవడంతో కొత్త సీపీపీఎస్ విధానం అమల్లోకి వస్తుంది. దాంతో 78 లక్షల మందికి పైగా ఈపీఎస్ పింఛనుదారులు లబ్ధి పొందుతారు.

ఈపీఎస్ పింఛనుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈపీఎఫ్ఓ నిరంతరం పనిచేస్తోంది. ఈ దిశగా కొత్త సీపీపీఎస్ విధానం ముఖ్యమైన సంస్కరణగా భావించచ్చు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …