रविवार, दिसंबर 22 2024 | 07:17:37 PM
Breaking News
Home / Choose Language / telugu / పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, ఇంకా డేటాల వినియోగంపై ప్రకటన

పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, ఇంకా డేటాల వినియోగంపై ప్రకటన

Follow us on:

ప్రపంచ వృద్ధి 3 శాతాని కంటే కాస్త ఎక్కువ మాత్రమే నమోదయింది. ఇది ఈ శతాబ్దం మొదలైన తరువాత నుంచి చూస్తే అత్యంత తక్కువ. మహమ్మారికి ముందు కాలంలో ఇది సగటున సుమారు 4 శాతం గా ఉండింది. దీనికి తోడు, టెక్నాలజీ ఊహించినదాని కంటే వేగంగా వెళుతోంది. టెక్నాలజీని సమాన స్థాయిలలో న్యాయబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా వృద్ధిని పెంచడానికీ, అసమానతలను తగ్గించడానికీ, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) సాధనలో అంతరాన్ని పూడ్చే దిశలో ఒక పెద్ద అడుగు వేయడానికీ ఒక చరిత్రాత్మక అవకాశాన్ని మనకు అందిస్తుంది.

స్థిరాభివృద్ధి లక్ష్యాల బాటలో వేగంగా సాగిపోవడానికి డిజిటల్ మార్పును అన్నిటా ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సువ్యవస్థిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)కు జతగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచితే అభివృద్ధి పథంలో పురోగమించడానికి సమాచారాన్ని ఉపయోగించుకొనే వీలు చిక్కడంతో పాటు కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించవచ్చని, మెరుగైన విద్యను, ఆరోగ్య సేవలను అందించవచ్చని జి20లోని అనేక సభ్య దేశాలు నిరూపించాయి. జి20 లో మిగిలిన దేశాలు కూడా వారి పౌరుల జీవనంలో పెనుమార్పులను తీసుకు వచ్చినట్లయితే చైతన్యశీల ప్రజాస్వామిక సిద్ధాంతాల పట్ల పౌరులలో విశ్వాసాన్ని తిరిగి పెంచవచ్చును. ఈ కారణంగా మేం యూఎన్ సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో గ్లోబల్ డిజిటల్ కంపేక్ట్ ను ఆమోదించిన సంగతిని మరోసారి గుర్తుకు తెస్తున్నాం. 2024లో ఈజిప్టు లోని కైరోలో జరిగిన గ్లోబల్ డీపీఐ సమ్మిట్‌ను కూడా మేం స్వాగతిస్తున్నాం.

టెక్నాలజీ వ్యవస్థలు వాటి ప్రయోజనాలను దేశంలో ప్రతి వ్యక్తికి అందించి ప్రజల జీవనాన్ని మెరుగు పరచడానికి వారితో చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు అనుబంధాన్ని ఏర్పరచుకొన్నప్పుడే ఉద్యోగాల కల్పనతో కూడిన  వృద్ధి ప్రయోజనాలను పొందవచ్చును. ఈ తరహా టెక్నాలజీ వ్యవస్థలు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే అభివృద్ధి ప్రధాన, వ్యక్తుల గోప్యతను పదిలపరచే, గౌరవించేవిగా రూపొందితేనే ఇది సాధ్య పడుతుంది. ఇక విపణి విషయానికి వస్తే, ఇ-కామర్స్, ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగం వంటి వివిధ రంగాలకు సేవలను అందించే ప్రైవేటు రంగం… టెక్నాలజీ వ్యవస్థతో ముడిపడవలసి వస్తుంది. దాపరికానికి చోటుండని, పరస్పర ఆశ్రితమై పని చేసే, విస్తరణకు వీలున్న తరహా టెక్నాలజీ వ్యవస్థలు రూపొందాలి. కాలం ముందుకు పోయే క్రమంలో జనాభా కూడా పెరుగుతూ, దేశాల అవసరాలు మార్పులకు లోనైనపుడల్లా ఈ వ్యవస్థలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నూతన స్థితికి అనుగుణంగా పని చేయగలుగుతాయి.

కాలం గడిచే కొద్దీ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాని విధంగా టెక్నాలజీ మారడానికిగాను మార్కెట్‌లో భాగస్తులకు సమానావకాశాలను అందించే తరహా టెక్నాలజీని అనుసరించడంతో పాటు అభివృద్ధి సాధన కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని, కృత్రిమ మేధ (ఏఐ)ని, డేటాను విరివిగా వినియోగించుకోవలసి ఉంటుంది. ఈ విధానం విస్తృత పోటీ, నూతన ఆవిష్కరణలు.. ఈ రెండిటినీ ప్రోత్సహించేందుకు అనుకూలమైందిగా ఉంటుంది. అంతేకాదు, మరిన్ని రంగాలలో అభివృద్ధికి స్ఫూర్తిని ఇస్తుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అసమానత్వాన్ని తగ్గించేస్తుంది కూడా.

డేటాను పరిరక్షించడానికి ఒకవైపు డేటా నిర్వహణకు, గోప్యతకు, భద్రతకు ఎదురయ్యే బెడదల నివారణకు నిస్పాక్షిక సిద్ధాంతాల రూపకల్పన, మరో వైపు మేధో సంపత్తి హక్కుల రక్షణను, రహస్య సమాచారం బయట పడకుండా చూడడంలో సాయాన్ని మార్కెట్లోని భాగస్తులకు అందించవలసి ఉంటుంది.

ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి విశ్వాసం అత్యంత ముఖ్యం. టెక్నాలజీ వ్యవస్థలకూ ఇది వర్తిస్తుంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ఈ టెక్నాలజీ వ్యవస్థలు వాటి కార్యకలాపాలలో దాపరికానికి తావు ఇవ్వకపోవడం, పౌరుల హక్కుల ఆదరణకు తగిన జాగ్రత్త చర్యలను తీసుకోవడం, నిస్పాక్షికంగా నడచుకోవడం కీలకం. ఈ కారణంగానే ఫౌండేషన్, ఫ్రాంటియర్ వంటి కృత్రిమ మేధ నమూనాల్లో భిన్నమైన డేటా సెట్స్‌ ఆధారంగా శిక్షణను ఇస్తున్నారు. తద్వారా మాత్రమే ప్రపంచంలో వేరు వేరు సమాజాలకు లబ్ధిని చేకూర్చడం సాధ్యం అవుతుంది.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …