रविवार, दिसंबर 22 2024 | 11:53:21 PM
Breaking News
Home / Choose Language / telugu / 27 అక్టోబర్ 2024 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 115 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

27 అక్టోబర్ 2024 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 115 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Follow us on:

నా ప్రియమైన దేశప్రజలారానమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ  అందరికీ స్వాగతంనా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయికానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది– అది గత సంవత్సరం నవంబర్ 15  తేదీన జరిగిందిఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా  భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చిందిఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.

మిత్రులారాభారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొందిప్రతి యుగంలో  సవాళ్లను ఎదుర్కొనే అసాధారణ భారతీయులు జన్మించారునేటి ‘మన్ కీ బాత్లో ధైర్యందూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తానువారి 150 జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం నిర్ణయించిందిఅక్టోబర్ 31 తేదీన సర్దార్ పటేల్ 150 జయంతి సంవత్సరం  ప్రారంభమవుతుందిదీని తరువాత భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సంవత్సరం నవంబర్ 15 తేదీన మొదలవుతుంది మహానుభావులు ఇద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారుఅయితే ఇద్దరి దృక్కోణం దేశ సమైక్యతే

మిత్రులారాగడిచిన సంవత్సరాల్లో దేశం మహానాయకుల  జయంతిని కొత్త శక్తితో జరుపుకోవడం ద్వారా కొత్త తరానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చిందిమనం మహాత్మా గాంధీ 150 జయంతిని ఎంత ప్రత్యేకంగా జరుపుకున్నామో మీకు గుర్తుండే ఉంటుందిన్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ నుండి ఆఫ్రికాలోని చిన్న గ్రామాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ  సత్యంఅహింసల సందేశాన్ని అర్థం చేసుకున్నారుతిరిగి తెలుసుకున్నారుఅలాగే జీవించారుయువకుల నుండి వృద్ధుల వరకుభారతీయుల నుండి విదేశీయుల వరకు ప్రతి ఒక్కరూ గాంధీజీ బోధనలను కొత్త సందర్భంలో అర్థం చేసుకున్నారుకొత్త ప్రపంచ పరిస్థితుల్లో వాటిని తెలుసుకున్నారుమనం స్వామి వివేకానంద 150 జయంతిని జరుపుకున్నప్పుడు దేశ యువత భారతదేశ ఆధ్యాత్మికసాంస్కృతిక శక్తిని కొత్త పరిభాషలో అర్థం చేసుకుందిమన గొప్ప వ్యక్తులు మరణించినంత మాత్రాన వారి ప్రభావం కోల్పోలేదనివారి జీవితాలు మన వర్తమానాన్ని భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతుందన్న భరోసా వీటివల్ల ఏర్పడుతుంది

మిత్రులారా మహనీయుల 150 జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందిమీ భాగస్వామ్యం మాత్రమే  ప్రచారానికి జీవం పోస్తుంది ఉత్సవాలకు జీవం అందిస్తుంది ప్రచారంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానుఉక్కు మనిషి సర్దార్ పటేల్కి సంబంధించిన మీ ఆలోచనలనుకార్యక్రమాలను # సర్దార్150 తో పంచుకోండి. #బిర్సాముండా150తో బిర్సా ముండా స్ఫూర్తిని ప్రపంచానికి అందించండిమనం కలసికట్టుగా  ఉత్సవాలను భిన్నత్వంలో భారతదేశ  ఏకత్వాన్ని చాటేవిధంగాగొప్ప వారసత్వాన్ని వికాస ఉత్సవంగా జరుగపుకుందాం.

  నా ప్రియమైన దేశవాసులారా! ‘ఛోటా భీమ్’ టీవీలో కనిపించడం ప్రారంభించిన  రోజులను మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ‘ఛోటా భీమ్’ అంటే ఎంత ఉత్కంఠ ఉండేదో పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు రోజు ఢోలక్ పూర్ డోలు  భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల పిల్లలను కూడా ఆకర్షిస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారుఅలాగే మన ఇతర యానిమేషన్ సీరియళ్లు ‘కృష్ణ’, ‘హనుమాన్’, ‘మోటుపత్లులకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారుభారతీయ యానిమేషన్ పాత్రలుఇక్కడి యానిమేషన్ సినిమాలు వాటి కంటెంట్సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మక్కువను చూరగొంటున్నాయిస్మార్ట్ఫోన్ నుండి సినిమా స్క్రీన్ వరకుగేమింగ్ కన్సోల్ నుండి వర్చువల్ రియాలిటీ వరకు యానిమేషన్ ప్రతిచోటా ఉంటుందని మీరు తప్పక చూసి ఉంటారుయానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోందిభారతదేశ గేమింగ్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తోంది రోజుల్లో భారతీయ ఆటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.  కొన్ని నెలల క్రితం నేను భారతదేశంలోని ప్రముఖ గేమర్లను కలిశానుఅప్పుడు భారతీయ గేమ్ అద్భుతమైన సృజనాత్మకతనాణ్యతను తెలుసుకునేఅర్థం చేసుకునే అవకాశం నాకు లభించిందినిజానికి దేశంలో సృజనాత్మక శక్తి తరంగం నడుస్తోందియానిమేషన్ ప్రపంచంలో ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియన్స్’ ప్రబలంగా ఉన్నాయినేడు భారతీయ ప్రతిభ కూడా విదేశీ నిర్మాణాలలో కూడా ముఖ్యమైన భాగంగా మారుతున్నదని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారుప్రస్తుత స్పైడర్ మ్యాన్ అయినాట్రాన్స్ఫార్మర్స్ అయినా  రెండు సినిమాల్లో హరినారాయణ్ రాజీవ్ అందించిన సహకారానికి ప్రజల ప్రశంసలు లభించాయిభారతదేశ యానిమేషన్ స్టూడియోలు డిస్నీవార్నర్ బ్రదర్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి.

మిత్రులారానేడు మన యువత అసలైన భారతీయ కంటెంట్ను సిద్ధం చేస్తోందిమన సంస్కృతికి ప్రతిబింబమైన ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయిఇతర పరిశ్రమలకు బలాన్ని ఇచ్చే స్థాయిలో యానిమేషన్ రంగం నేడు పరిశ్రమ రూపాన్ని సంతరించుకుంది రోజుల్లో వీఆర్ టూరిజం చాలా ప్రసిద్ధి చెందుతోందిమీరు వర్చువల్ యాత్ర ద్వారా అజంతా గుహలను చూడవచ్చుకోణార్క్ మందిర ఆవరణలో షికారు చేయవచ్చులేదా వారణాసి ఘాట్లను ఆస్వాదించవచ్చు వీఆర్ యానిమేషన్లన్నీ భారతీయులు సృష్టించినవేవీఆర్ ద్వారా  స్థలాలను చూసిన తర్వాత చాలా మంది  పర్యాటక ప్రదేశాలను వాస్తవంగా సందర్శించాలని కోరుకుంటారుఅంటే పర్యాటక గమ్యస్థానాల  వర్చువల్ టూర్ ప్రజల మనస్సుల్లో ఉత్సుకతను సృష్టించడానికి ఒక మాధ్యమంగా మారిందినేడు  రంగంలో యానిమేటర్లతో పాటు స్టోరీ టెల్లర్లురచయితలువాయిస్ ఓవర్ నిపుణులుసంగీతకారులుగేమ్ డెవలపర్లువర్చువల్ రియాలిటీ– ఆగ్మెంటెడ్ రియాలిటీ నిపుణులకు కూడా డిమాండ్ నిరంతరం పెరుగుతోందికాబట్టి సృజనాత్మకతను పెంచుకోవాలని నేను భారతదేశ యువతకు చెప్తాను.  ఎవరికి తెలుసు– ప్రపంచంలోని తర్వాతి సూపర్ హిట్ యానిమేషన్ మీ కంప్యూటర్ నుండే రావచ్చేమోతర్వాతి వైరల్ గేమ్ మీ సృష్టే కావచ్చువిద్యాపరమైన యానిమేషన్లలో మీ ఆవిష్కరణ గొప్ప విజయాన్ని సాధించగలదు. ‘వరల్డ్ యానిమేషన్ డే’ కూడా  అక్టోబర్ 28  తేదీన అంటే రేపు జరుపుకుంటున్నాంరండి…. భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్గా మార్చాలని సంకల్పిద్దాం.

నా ప్రియమైన దేశప్రజలారాస్వామి వివేకానంద ఒకప్పుడు విజయ మంత్రాన్ని అందించారు. ‘ఒక ఆలోచన తీసుకోండి ఆలోచనను మీ జీవితంగా చేసుకోండిదాని గురించి ఆలోచించండిదాని గురించి కలలుగనండిజీవించడం ప్రారంభించండి.’ అనే  విజయ మంత్రం ఆధారంగా ఆత్మ నిర్భర్ భారత్ విజయం  కూడా కొనసాగుతోంది ప్రచారం మన సామూహిక చైతన్యంలో భాగమైందిఅడుగడుగునా నిరంతరం మనకు స్ఫూర్తిగా నిలిచిందిస్వావలంబన మన విధానం మాత్రమే కాదు– అది మన అభిరుచిగా మారిందిచాలా సంవత్సరాలు కాలేదు– భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికత అభివృద్ధి చెందుతుందని పదేళ్ల కిందట ఎవరైనా చెప్తే చాలా మంది నమ్మేవారు కాదుచాలా మంది అపహాస్యం చేసేవారు.  కానీ  రోజు దేశ విజయాలను చూసి వారే ఆశ్చర్యపోతున్నారుస్వయం సమృద్ధి పొందిన తర్వాత భారతదేశం ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తోందిఒక్కసారి ఊహించుకోండి– ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తయారీదారుగా మారిందిఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాల కొనుగోలుదారుగా ఉన్న భారతదేశం ఇప్పుడు 85 దేశాలకు కూడా ఎగుమతి చేస్తోందిఅంతరిక్ష సాంకేతికతలో  రోజు భారతదేశం చంద్రుని  దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా మారిందినాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే  స్వావలంబన ప్రచారం ఇకపై కేవలం ప్రభుత్వ ప్రచారం కాదు– ఇప్పుడు స్వయం ఆధారిత భారతదేశ ప్రచారం ప్రజల ప్రచార ఉద్యమంగా మారుతోంది.  ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తోందిఉదాహరణకు  నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాంఇది 4300 మీటర్ల ఎత్తులో ఉందిఅందులో విశేషమేంటో తెలుసుకుందాంఇది భారతదేశ తయారీ– ‘మేడ్ ఇన్ ఇండియా’. మైనస్ 30 డిగ్రీల చల్లటి వాతావరణం ఉన్న ప్రదేశంలో– ఆక్సిజన్ కొరత కూడా ఉన్న ప్రదేశంలో– మన శాస్త్రవేత్తలతో పాటు స్థానిక పరిశ్రమలు ఆసియాలో మరే దేశం చేయని పనిని చేశాయి.  హాన్లే  టెలిస్కోప్ సుదూర ప్రపంచాన్ని చూస్తూ ఉండవచ్చుఅది మనకు మరొక విషయాన్ని కూడా చూపుతోంది  అది స్వయం సమృద్ధ భారతదేశ సామర్థ్యం.

మిత్రులారామీరు కూడా ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నానుభారతదేశం స్వయం సమృద్ధంగా మారడానికి దోహదపడే ప్రయత్నాలకు వీలైనన్ని ఎక్కువ ఉదాహరణలను పంచుకోండిమీ పరిసరాల్లో మీరు చూసిన కొత్త ఆవిష్కరణమీ ప్రాంతంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న స్థానిక స్టార్ట్అప్– ఇలాంటి విశేషాలను #AatmanirbharInnovationతో సోషల్ మీడియాలో రాయండిస్వావలంబన భారతదేశ ఉత్సవాలు నిర్వహించండి పండుగ సీజన్ లో మనమందరం స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని మరింత బలోపేతం చేద్దాంవోకల్ ఫర్ లోకల్ అనే మంత్రంతో మనం మన షాపింగ్ చేద్దాంఇది అసాధ్యం కేవలం సవాలుగా ఉన్న నవీన భారతదేశంఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మేక్ ఫర్ ది వరల్డ్గా మారిందిఇక్కడ ప్రతి పౌరుడు ఒక ఆవిష్కర్తఇక్కడ ప్రతి సవాలు ఒక అవకాశంమనం భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చడమే కాకుండా మన దేశాన్ని ప్రపంచవ్యాప్త ఆవిష్కరణల శక్తి కేంద్రంగా బలోపేతం చేయాలి.

నా ప్రియమైన దేశప్రజలారామీ కోసం ఒక ఆడియోను వినిపిస్తాను.

(ఆడియో)

ఫ్రాడ్ కాలర్ 1: హలో

బాధితుడుసార్ నమస్కారం సార్.

ఫ్రాడ్ కాలర్ 1: నమస్తే

బాధితుడుసార్… చెప్పండి సార్

ఫ్రాడ్ కాలర్ 1: మీరు నాకు పంపిన  FIR నంబర్ను చూడండి..  నంబర్పై మాకు 17 ఫిర్యాదులు ఉన్నాయిమీరు  నంబర్‌ ను వాడుతున్నారా?

బాధితుడునేను దీన్ని వాడను సార్.

ఫ్రాడ్ కాలర్ 1: మీరు ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?

బాధితుడుసార్.. కర్ణాటక సార్.. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను సార్.

ఫ్రాడ్ కాలర్ 1: సరేమన స్టేట్మెంట్ను రికార్డ్ చేద్దాం.  మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా  నంబర్‌ ను బ్లాక్ చేయవచ్చు.

బాధితుడుసరే సార్

ఫ్రాడ్ కాలర్ 1: నేను ఇప్పుడు మిమ్మల్ని మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో కనెక్ట్ చేస్తున్నాను నంబర్ ను బ్లాక్ చేసేందుకు మీ స్టేట్మెంట్ను రికార్డ్ చేయండి

బాధితుడుసరే సార్

ఫ్రాడ్ కాలర్ 1: అవును.. చెప్పండి… మీరు ఎవరుమీ ఆధార్ కార్డును నాకు చూపించండి.. వెరిఫై చేయడానికి నాకు తెలియజేయండి.

బాధితుడుసార్ నా దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు లేదు.. ప్లీజ్ సార్.

ఫ్రాడ్ కాలర్ 1: ఫోన్లో.. అది మీ ఫోన్లో ఉందా?

బాధితుడులేదు సార్

ఫ్రాడ్ కాలర్ 1: మీ ఫోన్లో ఆధార్ కార్డ్ ఫోటో లేదా?

బాధితుడులేదు సార్

ఫ్రాడ్ కాలర్ 1: మీకు నెంబర్ గుర్తుందా?

బాధితుడుసార్.. లేదు సార్.. నంబర్ కూడా గుర్తు లేదు సార్.

ఫ్రాడ్ కాలర్ 1: మేం కేవలం వెరిఫై చేయాలివెరిఫై చేసేందుకు కావాలి

బాధితుడులేదు సార్

ఫ్రాడ్ కాలర్ 1: భయపడొద్దు… భయపడొద్దు… మీరు ఏమీ చేయకపోతే భయపడొద్దు.

బాధితుడుసరే సార్సరే సార్

ఫ్రాడ్ కాలర్ 1: మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటేవెరిఫై చేయడానికి నాకు చూపించండి.

బాధితుడులేదు సార్లేదు సార్నేను ఊరికి వచ్చాను సార్ఆధార్ కార్డు ఇంట్లో ఉంది సార్..

ఫ్రాడ్ కాలర్ 1: ఓకే..

రెండో గొంతుమే  కమ్ ఇన్ సార్

ఫ్రాడ్ కాలర్ 1: కమ్ ఇన్

ఫ్రాడ్ కాలర్ 2: జై హింద్

ఫ్రాడ్ కాలర్ 1: జై హింద్

ఫ్రాడ్ కాలర్ 1: ప్రోటోకాల్ ప్రకారం ఇతని వన్ సైడెడ్ వీడియో కాల్ రికార్డ్ చేయండిఓకే?          

 ఆడియో కేవలం సమాచారం కోసం మాత్రమే కాదుఇది వినోదం కలిగించే ఆడియో కాదు ఆడియో తీవ్రమైన ఆందోళనతో వచ్చిందిమీరు ఇప్పుడే విన్న సంభాషణ డిజిటల్ అరెస్ట్ మోసంపై ఉంది సంభాషణ బాధితుడికిమోసగాడికి మధ్య జరిగిందిడిజిటల్ అరెస్ట్ మోసంలో కాలర్లు కొన్నిసార్లు పోలీసులుగాకొన్నిసార్లు సీబీఐ అధికారులుగాకొన్నిసార్లు నార్కోటిక్స్ అధికారులుగాకొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా వేర్వేరు హోదాలను  పెట్టుకునిమాట్లాడతారుచాలా నమ్మకంతో చేస్తారుచాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు  విషయాన్ని ఖచ్చితంగా చర్చించాలని నాతో అన్నారు మోసం ముఠా ఎలా పని చేస్తుందో ప్రమాదకరమైన ఆట ఏమిటో నేను మీకు చెప్తానుమీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యంఇతరులకు అర్థం చేయించడం కూడా అంతే ముఖ్యంమొదటి ఉపాయం – మీ వ్యక్తిగత సమాచారం అంతటినీ వారు సేకరిస్తారు. “మీరు గత నెలలో గోవా వెళ్లారుకదామీ అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది కదా?” ఇలా  వారు మీ గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తారుమీరు ఆశ్చర్యపోయేలా సమాచారాన్ని సేకరిస్తారురెండవ ఉపాయం  భయానక వాతావరణాన్ని సృష్టించడంయూనిఫాంప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుచట్టపరమైన విభాగాలుఅవి మిమ్మల్ని ఎంతగా భయపెడతాయంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించలేరుఆపై వారి మూడవ ఉపాయం ప్రారంభమవుతుందిమూడవ ఉపాయం – సమయం  ఒత్తిడి. ‘మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాలిలేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుంది‘ –ఇలా  వ్యక్తులు బాధితులు భయపడేంతగా చాలా మానసిక ఒత్తిడిని కలిగిస్తారుడిజిటల్ అరెస్ట్ బాధితుల్లో ప్రతి వర్గంప్రతి వయో బృందంలోనివారు ఉన్నారుప్రజలు కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను భయంతో నష్టపోయారుమీకు ఎప్పుడైనా ఇలాంటి కాల్ వస్తే భయపడాల్సిన పనిలేదుఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా  దర్యాప్తు సంస్థ కూడా ఇలాంటి విచారణలు చేయదని మీరు తెలుసుకోవాలిడిజిటల్ భద్రత లోని   మూడు దశలను నేను మీకు చెప్తాను మూడు దశలు  ‘వేచి ఉండండి– ఆలోచించండి– చర్య తీసుకోండి’ కాల్ వస్తే ‘వేచి ఉండండి‘. భయాందోళనలకు గురికాకండిప్రశాంతంగా ఉండండితొందరపాటుతో ఎటువంటి పనులూ చేయకండిమీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండివీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని రికార్డింగ్ చేయండిదీని తరువాత రెండవ దశమొదటి దశ వేచి చూడడంరెండో దశ ఆలోచించడం ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్లో ఇలాంటి బెదిరింపులు చేయదు.  వీడియో కాల్ ద్వారా విచారణ చేయదుఇలా డబ్బులు డిమాండ్ చేయదుమీకు భయం అనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందని అర్థం చేసుకోండిమొదటి దశరెండవ దశ తర్వాత ఇప్పుడు నేను మూడవ దశ గురించి చెప్తానుమొదటి దశలో నేను చెప్పాను ‘వేచి చూడండి’ అనిరెండవ దశలో ‘ఆలోచించండి’. మూడవ దశలో  ‘చర్య తీసుకోండి’. జాతీయ సైబర్ హెల్ప్లైన్ 1930కి డయల్ చేయండి.  cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండిమీ కుటుంబానికిపోలీసులకు తెలియజేయండిసాక్ష్యాలను భద్రపరచండి. ‘వేచి ఉండండి‘, ‘ఆలోచించండి‘, ఆపై ‘చర్య తీసుకోండి’.  మూడు దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయి.

మిత్రులారాచట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని మరోసారి చెప్తున్నానుఇది కేవలం మోసంవంచనఅబద్ధంఇది దుష్టుల ముఠా చేసే పని.  ఇలా చేస్తున్న వారు సమాజానికి శత్రువులని మళ్ళీ చెప్తున్నానుడిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో దర్యాప్తు సంస్థలన్నీ కలిసి పనిచేస్తున్నాయి ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు జరిగిందిఇలాంటి మోసాలకు పాల్పడిన వేలాది వీడియో కాలింగ్ ఐడీలను దర్యాప్తు సంస్థలు బ్లాక్ చేశాయిలక్షలాది సిమ్ కార్డులుమొబైల్ ఫోన్లుబ్యాంకు ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయిఏజెన్సీలు తమ పనిని చేస్తున్నాయికానీ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలను నివారించడానికి చాలా ముఖ్యమైంది – ప్రతి ఒక్కరికీ అవగాహనప్రతి పౌరునికీ అవగాహన రకమైన సైబర్ మోసాలకు గురైన వ్యక్తులు దాని గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలిఅవగాహన కోసం మీరు #SafeDigitalIndia ను  ఉపయోగించవచ్చుసైబర్ స్కామ్కు వ్యతిరేకంగా ప్రచారంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయవలసిందిగా పాఠశాలలుకళాశాలలను కూడా నేను కోరుతున్నానుసమాజంలోని ప్రతి ఒక్కరి కృషితోనే మనం  సవాలును ఎదుర్కోగలం.

నా ప్రియమైన దేశప్రజలారామన పాఠశాల పిల్లల్లో చాలా మంది కాలిగ్రఫీపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారుదీని ద్వారా మన చేతిరాత శుభ్రంగాఅందంగాఆకర్షణీయంగా ఉంటుందినేడు జమ్మూకాశ్మీర్లో స్థానిక సంస్కృతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారుఅక్కడి అనంతనాగ్కు చెందిన ఫిర్దౌసా బషీర్ గారికి కాలిగ్రఫీలో నైపుణ్యం ఉందిదీని ద్వారా స్థానిక సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలను ముందుకు తీసుకువస్తున్నారుఫిర్దౌసా గారి కాలిగ్రఫీ స్థానిక ప్రజలనుముఖ్యంగా యువతను ఆకర్షిస్తోందిఉదంపూర్కు చెందిన గోరీనాథ్ గారు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారుఒక శతాబ్దానికి పైగా పురాతనమైన సారంగి ద్వారా డోగ్రా సంస్కృతివారసత్వ  వివిధ రూపాలను సంరక్షించడంలో ఆయన నిమగ్నమై ఉన్నారుసారంగి రాగాలతో పాటు తమ సంస్కృతికి సంబంధించిన పురాతన కథలుచారిత్రక సంఘటనలను ఆసక్తికరంగా చెప్తారుదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన ఇలాంటి అసాధారణ వ్యక్తులు చాలా మందిని మీరు కలుస్తారుడి.వైకుంఠం దాదాపు 50 సంవత్సరాలుగా చేర్యాల్ జానపద కళను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారుతెలంగాణకు సంబంధించిన  కళను ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన కృషి అద్భుతంచేర్యాల్ పెయింటింగ్స్ సిద్ధం చేసే విధానం చాలా ప్రత్యేకమైందిఇది స్క్రోల్ రూపంలో కథలను ముందుకు తెస్తుందిఇందులో మన చరిత్రపురాణాల పూర్తి సంగ్రహావలోకనం లభిస్తుందిఛత్తీస్గఢ్లోని నారాయణపూర్కు చెందిన బుట్లూరామ్ మాత్రాజీ అబూజ్ మాడియా తెగకు చెందిన జానపద కళలను సంరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారుఆయన గత నాలుగు దశాబ్దాలుగా  పనిలో ఉన్నారు. ‘బేటీ బచావోబేటీ పడావో‘, ‘స్వచ్చ భారత్‘ వంటి ప్రచారాలతో ప్రజలను అనుసంధానించడంలో కూడా ఆయన కళ చాలా ప్రభావవంతంగా ఉంది.

మిత్రులారాకాశ్మీర్లోని లోయల నుండి ఛత్తీస్గఢ్ అడవుల వరకు మన కళలుసంస్కృతి ఎలా కొత్త రూపంలో విస్తరిస్తున్నాయో ఇప్పుడే మాట్లాడుకున్నాంఅయితే  విషయం ఇక్కడితో ముగియదుమన  కళల పరిమళం అంతటా వ్యాపిస్తోందిప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు భారతీయ కళలుసంస్కృతిని చూసి మంత్రముగ్ధులవుతున్నారుఉధంపూర్లో ప్రతిధ్వనించే సారంగి గురించి చెబుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉన్న రష్యాలోని యాకూత్స్క్ నగరంలో భారతీయ కళల మధురమైన రాగం ప్రతిధ్వనించడం నాకు గుర్తుకు వచ్చిందిఊహించుకోండి చలికాలం ఒకటిన్నర రోజులుమైనస్ 65 డిగ్రీల ఉష్ణోగ్రతచుట్టూ తెల్లటి మంచు దుప్పటిఅక్కడి థియేటర్లో కాళిదాసు  అభిజ్ఞాన శాకుంతలాన్ని ప్రేక్షకులు  మంత్రముగ్ధులై చూస్తున్నారు.  ప్రపంచంలోనే అత్యంత శీతల నగరమైన యాకూత్స్క్ లో భారతీయ సాహిత్యం  వెచ్చదనాన్ని మీరు ఊహించగలరాఇది ఊహ కాదు కానీ నిజంమనందరినీ గర్వంఆనందంతో నింపే సత్యం.

మిత్రులారాకొన్ని వారాల క్రితం నేను లావోస్ కు వెళ్ళానుఅది నవరాత్రి సమయంఅక్కడ నేను ఒక అద్భుతాన్ని చూశానుస్థానిక కళాకారులు “ఫలక్ ఫలం” అనే ‘లావోస్ రామాయణం‘ ప్రదర్శించారురామాయణం పట్ల మనకున్న అంకితభావమే వారి కళ్లలో శక్తిగావారి స్వరంలో సమర్పణా భావంగా  కనబడిందిఅదేవిధంగా కువైట్లో అబ్దుల్లా అల్బారూన్ గారు రామాయణ మహాభారతాలను అరబిక్‌ భాషలోకి అనువదించారు రచన కేవలం అనువాదం మాత్రమే కాదు– రెండు గొప్ప సంస్కృతుల మధ్య వారధిఆయన ప్రయత్నాలు అరబ్ ప్రపంచంలో భారతీయ సాహిత్యంపై కొత్త అవగాహనను పెంచుతున్నాయిమరొక స్ఫూర్తిదాయక ఉదాహరణ పెరూకు చెందిన ఎర్లిందా గార్సియా అక్కడి యువతకు భరతనాట్యం నేర్పుతున్నారుమరియా వాల్దెజ్ ఒడిస్సీ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు కళల ప్రభావంతో ‘భారతీయ శాస్త్రీయ నృత్యం‘ దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది.

మిత్రులారావిదేశీ గడ్డపై భారతదేశానికి చెందిన   ఉదాహరణలు భారతీయ సంస్కృతి శక్తి ఎంత అద్భుతమైందో చూపిస్తాయి శక్తి నిరంతరం ప్రపంచాన్ని తనవైపు ఆకర్షిస్తూనే ఉంటుంది.

ఎక్కడెక్కడ కళ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది.”

సంస్కృతి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది

నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారుభారతదేశ ప్రజలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారుకాబట్టి మీ అందరికి ఒక విన్నపం… మీ చుట్టూ ఉన్న ఇలాంటి సాంస్కృతిక అంశాలను #CulturalBridges తో పంచుకోండిఅలాంటి ఉదాహరణలను మనం ‘మన్ కీ బాత్లో మరింత చర్చిస్తాం.

నా ప్రియమైన దేశప్రజలారాదేశంలోని చాలా ప్రాంతాల్లో చలికాలం మొదలైందిఅయితే ఫిట్నెస్ పై అభిరుచిఫిట్ ఇండియా స్ఫూర్తి విషయంలో  వాతావరణానికీ తేడా లేదుఫిట్గా ఉండే అలవాటు ఉన్నవారు చలివేడివర్షం గురించి పట్టించుకోరుభారతదేశంలోని ప్రజలు ఇప్పుడు ఫిట్నెస్ గురించి మరింత అవగాహన పెంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నానుమీ చుట్టుపక్కల ఉన్న పార్కుల్లో ప్రజల సంఖ్య పెరుగుతుండటం కూడా మీరు గమనిస్తూ ఉండాలిపార్కులో షికారు చేసే వృద్ధులుయువకులుయోగా చేసే కుటుంబ సభ్యులను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందినాకు గుర్తుంది– నేను యోగా దినోత్సవం రోజున శ్రీనగర్లో ఉన్నప్పుడు వర్షం ఉన్నప్పటికీ చాలా మంది ‘యోగా‘ కోసం ఒక్కచోటికి చేరారుకొద్దిరోజుల క్రితం శ్రీనగర్లో జరిగిన మారథాన్లో కూడా ఫిట్గా ఉండేందుకు ఇదే ఉత్సాహం కనిపించింది ఫిట్ ఇండియా భావన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారుతోంది.

మిత్రులారామన పాఠశాలలు ఇప్పుడు పిల్లల ఫిట్నెస్పై ఎక్కువ శ్రద్ధ చూపడం చూసి నేను కూడా సంతోషిస్తున్నానుఫిట్ ఇండియా స్కూల్ అవర్స్ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమంవివిధ ఫిట్నెస్ కార్యకలాపాల కోసం పాఠశాలలు తమ మొదటి పీరియడ్ని ఉపయోగిస్తున్నాయిచాలా పాఠశాలల్లో కొన్ని రోజులు పిల్లలతో  యోగా చేయిస్తారుకొన్ని రోజులు ఏరోబిక్స్ సెషన్లు ఉంటాయికొన్ని రోజులు క్రీడా నైపుణ్యాలను పెంచే పని చేస్తారుకొన్ని రోజులు ఖోఖోకబడ్డీ వంటి సాంప్రదాయిక ఆటలను ఆడుతున్నారుదాని ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుందిహాజరు మెరుగుపడుతుందిపిల్లల ఏకాగ్రత పెరుగుతుందిపిల్లలు కూడా సరదాగా ఉంటారు.

మిత్రులారానేను  వెల్నెస్ శక్తిని ప్రతిచోటా చూస్తున్నానుచాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు తమ అనుభవాలను కూడా నాకు పంపారుకొంతమంది చాలా ఆసక్తికరమైన ప్రయోగాలు చేస్తున్నారువీటిలో ఒక ఉదాహరణ ఫ్యామిలీ ఫిట్నెస్ అవర్అంటే కుటుంబ ఫిట్నెస్ యాక్టివిటీ కోసం ప్రతి వారాంతంలో కుటుంబాలు ఒక గంట కేటాయిస్తున్నాయిమరో ఉదాహరణ స్వదేశీ ఆటల పునరుద్ధరణఅంటే కొన్ని కుటుంబాలు తమ పిల్లలకు సాంప్రదాయిక ఆటలను నేర్పిస్తున్నాయిమీరు మీ ఫిట్నెస్ రొటీన్ అనుభవాన్ని తప్పనిసరిగా #fitIndia పేరుతో సామాజిక మాధ్యమంలో పంచుకోండినేను దేశ ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించాలనుకుంటున్నానుఈసారి దీపావళి పండుగ సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31  వస్తోందిమనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 “జాతీయ ఐక్యతా దినోత్సవం” రోజున ‘రన్ ఫర్ యూనిటీని నిర్వహిస్తాంఈసారి దీపావళి కారణంగా అక్టోబర్ 29 తేదీన అంటే మంగళవారంనాడు ‘రన్ ఫర్ యూనిటీ’ జరుగుతుందిఇందులో అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నానుజాతీయ ఐక్యత మంత్రంతో పాటు ఫిట్నెస్ మంత్రాన్ని ప్రతిచోటా వ్యాప్తి చేయండి.

నా ప్రియమైన దేశవాసులారా! ‘మన్ కీ బాత్లో  సారి ఇంతేమీరు మీ అభిప్రాయాలను పంపుతూ ఉండండిఇది పండుగల కాలంధన్ తేరస్దీపావళిఛత్ పూజగురునానక్ జయంతి – అన్ని పండుగల సందర్భంగా ‘మన్ కీ బాత్’ శ్రోతలకు శుభాకాంక్షలుమీరందరూ పండుగలను పూర్తి ఉత్సాహంతో జరుపుకోవాలివోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోండిపండుగల సమయంలో స్థానిక దుకాణదారుల నుండి కొనుగోలు చేసిన వస్తువులు మీ ఇంటికి వచ్చేలా చూసుకోండిరాబోయే పండుగల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలుధన్యవాదాలు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …