रविवार, दिसंबर 22 2024 | 08:22:27 PM
Breaking News
Home / Choose Language / telugu / ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో 51,000 మందికి పైగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాల పంపిణీ

ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో 51,000 మందికి పైగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాల పంపిణీ

Follow us on:

ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం జరిగిన  51,000 మందికి పైగా యువతీయువకులకుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న ఉదయం పదిన్నర గంటలకు దృశ్య మాధ్యమం (వీడియో కాన్ఫరెన్సింగ్) ద్వారా  నియామక పత్రాలను అందించనున్నారు.  ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.

ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలన్న ప్రధాని నిబద్ధతను ‘రోజ్‌గార్ మేళా’ ప్రముఖంగా చాటిచెబుతోంది.  దేశ నిర్మాణంలో తోడ్పాటును అందించడానికి యువతకు సార్థక అవకాశాలను రోజ్ గార్ మేళా అందిస్తోంది.

రోజ్‌గార్ మేళాను దేశవ్యాప్తంగా 40 చోట్ల నిర్వహించనున్నారు.  కొత్తగా ఉద్యోగాలలో నియామకం పొందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలోను, విభాగాలలోను చేరనున్నారు. యువత చేరనున్న విభాగాలలో రెవెన్యూ విభాగం, ఉన్నత విద్య విభాగం, హోం మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మొదలైనవి ఉన్నాయి.

నియామక ప్రక్రియలో కృతార్థులైన యువతకు ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా మౌలిక శిక్షణను అందుకొనేందుకు అవకాశం లభించనుంది.  ‘ఐజీవోటీ కర్మయోగి పోర్టల్’ (iGOT Karmayogi portal)లో అందుబాటులో ఉండే ఆన్‌లైన్ విభాగమే ‘కర్మయోగి ప్రారంభ్’.  దీనిలో 400కు పైగా ఈ-లెర్నింగ్ కోర్సులు భాగంగా ఉన్నాయి.  ఈ కోర్సులు ఉద్యోగ నియామకం పొందిన వారు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (‘వికసిత్ భారత్’) ఆవిష్కరించే దిశలో కృషి చేయడానికి వారి వారి విధులను దక్షతతో నిర్వహించేందుకు అవసరమైన ముఖ్య నైపుణ్యాలను వారికి అందిస్తాయి.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …