सोमवार, दिसंबर 23 2024 | 07:26:10 AM
Breaking News
Home / Choose Language / telugu / పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 13న ఏలూరులో శిబిరాలు నిర్వహణ

పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 13న ఏలూరులో శిబిరాలు నిర్వహణ

Follow us on:

ముఖ గుర్తింపు సాంకేతికత (ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ) ద్వారా పింఛనుదారులు ‘లైఫ్‌ సర్టిఫికెట్‌’ సమర్పణను క్రమబద్ధీకరించడానికి, కేంద్ర పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూ) ఈ నెలలో దేశవ్యాప్తంగా ‘డీఎల్‌సీ ప్రచారం 3.0’ను నిర్వహిస్తోంది. ఈ సాంకేతికతతో, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఆధార్-ఆధారిత గుర్తింపు ద్వారా పింఛనుదారులు తన జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు.

గతంలో, పింఛనుదారులు పింఛను ఇచ్చే కార్యాలయాలకు వెళ్లవలసివచ్చేది. ఇది వృద్ధులకు ఇబ్బందిగా ఉండేది. 2014లో, డీవోపీపీడబ్ల్యూ డిజిటల్ లైఫ్‌ సర్టిఫికెట్‌‌లు (జీవన్ ప్రమాణ్), ముఖ గుర్తింపు సాంకేతికతను 2021లో ప్రవేశపెట్టింది. ఈ నూతన సాంకేతికత, బయోమెట్రిక్ పరికరాల అవసరాన్ని తొలగించి ధృవీకరణ ప్రక్రియను మరింత అందుబాటులోకి తెచ్చింది.

2022లో, డీవోపీపీడబ్ల్యూ 37 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి 1.41 కోట్ల డీఎల్‌సీలను జెనరేట్‌ చేసింది. 2023లో ఆ ప్రచారం 100 ప్రాంతాలకు విస్తరించింది 1.47 కోట్లకు పైగా డీఎల్‌సీలు ఉత్పత్తి అయ్యాయి.

ఈ సంవత్సరం, ప్రచారం 3.0 (నవంబర్ 1-30 తేదీల్లో నిర్వహణ) దేశవ్యాప్తంగా 800 స్థానాల్లో జరుగుతుంది. బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పెన్షనర్స్ అసోసియేషన్లు, ఉడాయ్‌, కేంద్ర ఎలక్ర్టానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ, టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం వంటివి ఈ ప్రచారంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. డిజిటల్ సర్టిఫికెట్‌ సమర్పణలో పింఛనుదారులకు సాయం చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ సీనియర్ పింఛనుదారులు లేదా దివ్యాంగ పింఛనుదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అవసరమైతే ఇంటి వద్దకే వెళ్లడం వంటివి చేస్తారు. డీవోపీపీడబ్ల్యూ పర్యవేక్షణ కింద డీఎల్‌సీ పోర్టల్ ద్వారా సామాజిక మాధ్యమాలు ప్రచారం 3.0ను ప్రోత్సహిస్తాయి.

మారుమూల ప్రాంతాలు లేదా పరిమిత అనుసంధానత ఉన్న ప్రాంతాల్లోని పింఛనుదారులు కూడా ఈ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందేలా చూడడమే ప్రచారం లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌లో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు నగరంలోని సీఆర్‌ఆర్‌ కళాశాల, సెయింట్ థెరిసా కళాశాల, అశోక్ నగర్, ఏలూరు యూబీఐ ఆర్‌ఆర్‌ పేట్‌, ఏలూరు యూబీఐ ఆర్‌ఆర్‌ పేట్‌ క్యాబ్‌లో శిబిరాలు నిర్వహిస్తోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తన పోస్ట్‌మెన్, గ్రామీణ డాక్ సేవక్‌ల ద్వారా పింఛనుదారుల కోసం క్యాంపులు నిర్వహిస్తోంది & ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తోంది. 13 నవంబర్ 2024 బుధవారం నాడు, డీవోపీపీడబ్ల్యూ అసిస్టెంట్ డైరెక్టర్ (ఓఎల్‌) శ్రీమతి మంజు గుప్తా యూబీఐ, ఐపీపీబీ నిర్వహిస్తున్న శిబిరాలను సందర్శిస్తారు. లైఫ్‌ సర్టిఫికెట్‌‌లను సమర్పించేందుకు వివిధ డిజిటల్ విధానాలను ఉపయోగించడంలో పింఛనుదారులకు ఆమె సాయం చేస్తారు. ఆధార్‌ వివరాలు నవీకరించడానికి లేదా ఏదైనా సాంకేతిక సమస్య వస్తే అక్కడికక్కడే పరిష్కరించడానికి ఈ శిబిరాల్లో ఉడాయ్‌ అధికారులు కూడా పాల్గొంటారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …