गुरुवार, अक्तूबर 31 2024 | 08:48:52 PM
Breaking News
Home / Choose Language / telugu / సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి

Follow us on:

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణపై ఆయన అంకితభావాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ, ఆయనకు నా శిరసాభివందనం. దేశ సమైకత్య, సార్వభౌమత్వ పరిరక్షణకే పటేల్ తన జీవితాంతం అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆయన వ్యక్తిత్వం, కృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకం’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

27 అక్టోబర్ 2024 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 115 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ  అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది– అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను. మిత్రులారా! భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ప్రతి యుగంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే అసాధారణ భారతీయులు జన్మించారు. నేటి ‘మన్ కీ బాత్‘లో ధైర్యం, దూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తాను. వారి 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం నిర్ణయించింది. అక్టోబర్ 31వ తేదీన సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం  ప్రారంభమవుతుంది. దీని తరువాత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన మొదలవుతుంది. ఈ మహానుభావులు ఇద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరి దృక్కోణం దేశ సమైక్యతే.  మిత్రులారా! గడిచిన సంవత్సరాల్లో దేశం మహానాయకుల  జయంతిని కొత్త శక్తితో జరుపుకోవడం ద్వారా కొత్త తరానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని ఎంత ప్రత్యేకంగా జరుపుకున్నామో మీకు గుర్తుండే ఉంటుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ నుండి ఆఫ్రికాలోని చిన్న గ్రామాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ  సత్యం, అహింసల సందేశాన్ని అర్థం చేసుకున్నారు. తిరిగి తెలుసుకున్నారు. అలాగే జీవించారు. యువకుల నుండి వృద్ధుల వరకు, భారతీయుల నుండి విదేశీయుల వరకు ప్రతి ఒక్కరూ గాంధీజీ బోధనలను కొత్త సందర్భంలో అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచ పరిస్థితుల్లో వాటిని తెలుసుకున్నారు. మనం స్వామి వివేకానంద 150వ జయంతిని జరుపుకున్నప్పుడు దేశ యువత భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తిని కొత్త పరిభాషలో అర్థం చేసుకుంది. మన గొప్ప వ్యక్తులు మరణించినంత మాత్రాన వారి ప్రభావం కోల్పోలేదని, వారి జీవితాలు మన వర్తమానాన్ని భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతుందన్న భరోసా వీటివల్ల ఏర్పడుతుంది.  మిత్రులారా! ఈ మహనీయుల 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ భాగస్వామ్యం మాత్రమే ఈ ప్రచారానికి జీవం పోస్తుంది. ఈ ఉత్సవాలకు జీవం అందిస్తుంది. ఈ ప్రచారంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కి సంబంధించిన మీ ఆలోచనలను, కార్యక్రమాలను # సర్దార్150 తో పంచుకోండి. #బిర్సాముండా150తో బిర్సా ముండా స్ఫూర్తిని ప్రపంచానికి అందించండి. మనం కలసికట్టుగా ఈ ఉత్సవాలను భిన్నత్వంలో భారతదేశ  ఏకత్వాన్ని చాటేవిధంగా, గొప్ప వారసత్వాన్ని వికాస ఉత్సవంగా జరుగపుకుందాం.   నా ప్రియమైన దేశవాసులారా! ‘ఛోటా భీమ్’ టీవీలో కనిపించడం ప్రారంభించిన ఆ రోజులను మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ‘ఛోటా భీమ్’ అంటే ఎంత ఉత్కంఠ ఉండేదో పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ రోజు ఢోలక్ పూర్ డోలు  భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల పిల్లలను కూడా ఆకర్షిస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే మన ఇతర యానిమేషన్ సీరియళ్లు ‘కృష్ణ’, ‘హనుమాన్’, ‘మోటు–పత్లు’లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేషన్ పాత్రలు, ఇక్కడి యానిమేషన్ సినిమాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మక్కువను చూరగొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ నుండి సినిమా స్క్రీన్ వరకు, గేమింగ్ కన్సోల్ నుండి వర్చువల్ రియాలిటీ వరకు యానిమేషన్ ప్రతిచోటా ఉంటుందని మీరు తప్పక చూసి ఉంటారు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశ గేమింగ్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజుల్లో భారతీయ ఆటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.  కొన్ని నెలల క్రితం నేను భారతదేశంలోని ప్రముఖ గేమర్లను కలిశాను. అప్పుడు భారతీయ గేమ్‌ల అద్భుతమైన సృజనాత్మకత, నాణ్యతను తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం నాకు లభించింది. నిజానికి దేశంలో సృజనాత్మక శక్తి తరంగం నడుస్తోంది. యానిమేషన్ ప్రపంచంలో ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియన్స్’ ప్రబలంగా ఉన్నాయి. నేడు భారతీయ ప్రతిభ కూడా విదేశీ నిర్మాణాలలో కూడా ముఖ్యమైన భాగంగా మారుతున్నదని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రస్తుత స్పైడర్ మ్యాన్ అయినా, ట్రాన్స్‌ఫార్మర్స్ అయినా ఈ రెండు సినిమాల్లో హరినారాయణ్ రాజీవ్ అందించిన సహకారానికి ప్రజల ప్రశంసలు లభించాయి. భారతదేశ యానిమేషన్ స్టూడియోలు డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి. మిత్రులారా! నేడు మన యువత అసలైన భారతీయ కంటెంట్‌ను సిద్ధం చేస్తోంది. మన సంస్కృతికి ప్రతిబింబమైన ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమలకు బలాన్ని ఇచ్చే స్థాయిలో యానిమేషన్ రంగం నేడు పరిశ్రమ రూపాన్ని సంతరించుకుంది. ఈ రోజుల్లో వీఆర్ టూరిజం చాలా ప్రసిద్ధి చెందుతోంది. మీరు వర్చువల్ యాత్ర ద్వారా అజంతా గుహలను చూడవచ్చు. కోణార్క్ మందిర ఆవరణలో షికారు చేయవచ్చు. లేదా వారణాసి ఘాట్‌లను ఆస్వాదించవచ్చు. ఈ వీఆర్ యానిమేషన్‌లన్నీ భారతీయులు సృష్టించినవే. వీఆర్ ద్వారా ఈ స్థలాలను చూసిన తర్వాత చాలా మంది ఈ పర్యాటక ప్రదేశాలను వాస్తవంగా సందర్శించాలని కోరుకుంటారు. అంటే పర్యాటక గమ్యస్థానాల  వర్చువల్ టూర్ ప్రజల మనస్సుల్లో ఉత్సుకతను సృష్టించడానికి ఒక మాధ్యమంగా మారింది. నేడు ఈ రంగంలో యానిమేటర్లతో పాటు స్టోరీ టెల్లర్లు, రచయితలు, వాయిస్ ఓవర్ నిపుణులు, సంగీతకారులు, గేమ్ డెవలపర్లు, వర్చువల్ రియాలిటీ– ఆగ్మెంటెడ్ రియాలిటీ నిపుణులకు కూడా డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కాబట్టి సృజనాత్మకతను పెంచుకోవాలని నేను భారతదేశ యువతకు చెప్తాను.  ఎవరికి తెలుసు– ప్రపంచంలోని తర్వాతి సూపర్ హిట్ యానిమేషన్ మీ కంప్యూటర్ నుండే రావచ్చేమో! తర్వాతి వైరల్ గేమ్ మీ సృష్టే కావచ్చు! విద్యాపరమైన యానిమేషన్లలో మీ ఆవిష్కరణ గొప్ప విజయాన్ని సాధించగలదు. ‘వరల్డ్ యానిమేషన్ డే’ కూడా ఈ అక్టోబర్ 28 వ తేదీన అంటే రేపు జరుపుకుంటున్నాం. రండి…. భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్‌గా మార్చాలని సంకల్పిద్దాం. నా ప్రియమైన దేశప్రజలారా! స్వామి వివేకానంద ఒకప్పుడు విజయ మంత్రాన్ని అందించారు. …