रविवार, दिसंबर 22 2024 | 07:59:38 PM
Breaking News
Home / Choose Language / telugu / అక్టోబర్ 22న హైదరాబాద్లో “జీవన సౌలభ్యం: క్షేత్రస్థాయిలో సేవలను మెరుగుపరచటం” అనే అంశంపై పంచాయితీ సమ్మేళనాన్ని నిర్వహించనున్న పంచాయతీరాజ్ శాఖ.

అక్టోబర్ 22న హైదరాబాద్లో “జీవన సౌలభ్యం: క్షేత్రస్థాయిలో సేవలను మెరుగుపరచటం” అనే అంశంపై పంచాయితీ సమ్మేళనాన్ని నిర్వహించనున్న పంచాయతీరాజ్ శాఖ.

Follow us on:

హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్)లో అక్టోబర్ 22న ‘జీవన సౌలభ్యం: క్షేత్ర స్థాయిలో సేవలను మెరుగుపరచటం’ అనే అంశంపై పంచాయతీ సమ్మేళనం జరగనుంది.

 పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్, ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీ. నరేంద్ర కుమార్, పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ నగర్, తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ లోకేష్ కుమార్ డీఎస్ పాల్గొననున్నారు.

క్షేత్రస్థాయిలో సేవలను మెరుగ్గా అందించటం ద్వారా మెరుగైన జీవన సౌలభ్యాన్ని సాధించే దిశగా పంచాయితీ సమ్మేళనం ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జీ పంచాయతీ రాజ్ సంస్థలకు (పీఆర్ఐ)లకు స్థానిక స్వపరిపాలన సంస్థలుగా పని చేసే అధికారాన్ని ఇచ్చింది. ఈ విషయంలో సాధికారత కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సాంఘిక సంక్షేమం, ప్రజాపంపిణీ వ్యవస్థలతో సహా 29 అంశాల్లో పంచాయతీ రాజ్ సంస్థలు స్వయంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆర్టికల్ 243జీ వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన, సజావుగా సేవలు అందించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పరిపాలనను మెరుగుపరచాలన్న గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘జీవన సౌలభ్యం: క్షేత్ర స్థాయిలో సేవలను మెరుగుపరచడం’ అనే అంశంపై నిర్వహిస్తోన్న ఈ సమ్మేళనంలో భాగంగా నాలుగు ప్రాంతీయ వర్క్షాప్లను ఏర్పాటు చేశారు. 2024 అక్టోబర్ 22న హైదరాబాద్లో జరిగే ఈ వర్క్షాప్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో సేవలను అందించటంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులకు.. సేవలు అందించడంలో అనుభవాలు, సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు ఇది ఒక వేదికను కల్పిస్తుంది. వివిధ భాషల్లో అనువాదం కోసం భాషిని వంటి డిజిటల్ ప్రజా సాధనాలను ఉపయోగించడం, కమ్యూనికేషన్ కోసం యునిసెఫ్కు చెందిన రాపిడ్ ప్రో ప్లాట్ఫామ్ వాడుకోవటం, ఆన్లైన్లో సేవలు అందించటం కోసం సర్వీస్ప్లస్ను ఉపయోగించటం వంటి అంశాలపై చర్చించనున్నారు.

చిట్టచివర్లో ఉన్న వారికి సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలనను అందించటాన్ని వేగవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక వ్యూహాలు, ఉత్తమ పద్ధతులు, ఆలోచనలను పంచుకోవటమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచటం, వాటి ప్రామాణికతలను నిర్ణయించటంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవల విషయంలో ప్రామాణికలతపై జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ&పీఆర్) పలు పరిశీలనలను పంచుకోనుంది. సేవలను అందించటాన్ని మెరుగుపరిచేందుకు ఉపమోగించదగిన నూతన సాంకేతికతల గురించి ఇక్కడ చర్చించనున్నారు. దీనికోసం వాధ్వానీ ఫౌండేషన్ కేస్ స్టడీస్ను ప్రదర్శించనున్నారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …