गुरुवार, नवंबर 14 2024 | 09:11:25 AM
Breaking News
Home / Choose Language / telugu / ‘‘లైట్స్, కెమెరా,గోవా! ఇఫీ 2024 వేడుకల్లో భాగం కండి’’ నవంబర్ 20 నుంచి 28 వరకు

‘‘లైట్స్, కెమెరా,గోవా! ఇఫీ 2024 వేడుకల్లో భాగం కండి’’ నవంబర్ 20 నుంచి 28 వరకు

Follow us on:

జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ), ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా(ఈఎస్‌జీ) సహకారంతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నెల 20 నుంచి 28 వరకు 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)ను నిర్వహిస్తుంది. ఆకర్షణీయమైన, వైవిద్యమైన కార్యక్రమాలతో నిండిన ఈ కార్యక్రమం సినిమా ప్రేమికులకు మరపురాని అనుభూతిని ఇస్తుంది.

55వ ఇఫీ ఆరంభానికి ముందుగా మీడియా సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సమాచార, ప్రసార శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి నీరజా శేఖర్, ఇఫీ ఉత్సవ సంచాలకులు శ్రీ శేఖర్ కపూర్, సీబీఎఫ్‌సీ ఛైర్మన్ శ్రీ ప్రసూన్ జోషి, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎల్.మురుగన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉత్సవ ప్రాధాన్యాన్ని వివరించారు. ‘‘భారత్‌లో మాత్రమే కాకుండా కేన్స్ లాంటి అంతర్జాతీయ వేడుకలతో పోల్చదగిన ముఖ్యమైక కార్యక్రమం ఇఫీ’’ అని వర్ణించారు. ఏటా ఉత్సవాల అనుభవాన్ని మెరుగుపరిచేవిధంగా చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రధానంగా ప్రస్తావించిన డాక్టర్ మురుగన్, ఈ ఏడాది వేడుకలకు అంతర్జాతీయంగా విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ఇది చలనచిత్రోత్సవ విస్తృతిని, ప్రభావాన్ని తెలియజేస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయి, చెన్నైతో సహా ప్రధాన నగరాల్లో ఇటీవలే రోడ్ షోలను మంత్రిత్వశాఖ నిర్వహించింది. త్వరలోనే హైదరాబాద్‌లోనూ ఈ కార్యక్రమం జరగనుంది. ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని, ఇఫీని అంతర్జాతీయ సినీ వేడుకగా జరుపుకోవాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రతిబింబించేలా సినీ ప్రముఖులు దీన్ని తమ సొంత పండగలా స్వీకరించాలని డాక్టర్ మురుగన్ కోరారు. ప్రజలందరూ గోవాలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇఫి 2024 ఇతివృత్తం ‘యువ సినీ దర్శకులు’ –‘‘భవిష్యత్తు ఇప్పుడే’’

కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఆలోచనలకు అనుగుణంగా ఇఫీ 2024 ఇతివృత్తం యువ దర్శకులపై ప్రధాన దృష్టి సారించింది. వారి సామర్థ్యాన్ని గుర్తించి సృజనాత్మక భవిష్యత్తును రూపొందించేందుకు ప్రాధాన్యమిస్తుంది.

‘‘వైవిధ్యమైన విధానాలు, ఆలోచనలను అందిపుచ్చుకుంటూ, ప్రపంచంలోనే అతి పెద్ద చిత్ర నిర్మాణ దేశంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పరిశ్రమలో నూతనంగా ఆవిర్భవిస్తున్న ప్రతిభ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది’’ అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తన ప్రారంభోపన్యాసంలో వివరించారు. ఇఫీ 2024 సినిమా రూపకర్తలు, సినీ ప్రేమికులు ఇద్దరి కోసం రూపొందించామని, భవిష్యత్తును నిర్దేశించే వారికి, ముఖ్యంగా దేశ సాంస్కృతిక నేపథ్యాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న యువ దర్శక నిర్మాతలకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.

క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో వేదికను 100 మంది యువ ప్రతిభావంతులకు సాయం అందించేలా మెరుగుపరిచారు. దీని ద్వారా గతంలో జరిగిన చలనచిత్రోత్సవాల్లో 75 మందికి మాత్రమే మద్ధతు లభించేది. దేశవ్యాప్తంగా వివిధ ఫిలిం స్కూళ్లకు చెందిన 400 మంది యువ సినిమా విద్యార్థులు ఇఫీకి హాజరయ్యేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మంత్రిత్శ శాఖ కల్పిస్తుంది.

దేశంలో యువ చిత్ర దర్శకుల ప్రతిభను గుర్తించేందుకు మొదటి సారిగా నూతన పురస్కార విభాగాన్ని పరిచయం చేశారు. అదే ఉత్తమ భారతీయ డెబ్యూ డైరెక్టర్. యువ దర్శకుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు, చర్చా వేదికలు, చిత్ర మార్కెట్, సినిమా ప్యాకేజీలను రూపొందించారు. ఈ వేడుక చలనచిత్ర రంగంలో దిగ్గజాలకు నివాళి అర్పిస్తుంది. అలాగే వైవిధ్యమైన దృక్పథాలను ప్రత్యేక విభాగాలు, ఎగ్జిబిషన్ల ద్వారా ప్రదర్శిస్తుంది. ఇది గోవాలోని ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి 55వ ఇఫీలో భాగస్వామ్య అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. చలనచిత్ర పరిశ్రమ కోసం చిత్ర పరిశ్రమే నిర్వహించే వేడుకగా వర్ణించారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ఈ ఉత్సవానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనిని చరిత్రాత్మకంగా పేర్కొంటూ, ‘‘చలన చిత్రోత్సవ చరిత్రలో మొదటిసారిగా, ఈ మొత్తం కార్యక్రమానికి నాయకత్వం వహించే బాధ్యతను పరిశ్రమకే అప్పగించే సంప్రదాయాన్ని ప్రారంభించాం’’ అని తెలిపారు.

ఇఫీ: కథ చెప్పే కళకు వేడుక

సినిమాలో కథన ప్రాధాన్యం గురించి చిత్రోత్సవ డైరెక్టర్ శేఖర్ కపూర్ ప్రస్తావించారు. ఇది చలన చిత్రానుభూతికి హృదయంగా అభివర్ణించారు.

‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో కథ చెప్పే నైపుణ్యాన్ని కొనసాగించడం మునుపటి కంటే చాలా అవసరం’’ అని ఆయన పేర్కొన్నారు. కథలే సినిమాను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఈ కాలాతీతతమైన కళను గౌరవించే, ప్రోత్సహించే అంశంలో ఈ వేడుకలకున్న కృతనిశ్చయాన్ని ఆయన ఇచ్చిన సందేశం ప్రతిఫలిస్తుంది.

భారత్: విశ్రాంతి లేని కలల దేశం

భారత్‌ను ‘‘విశ్రాంతి లేని స్వప్నాల దేశం’’గా సీబీఎఫ్‌సీ ఛైర్మన్ ప్రసూన్ జోషి వర్ణించారు. కథకులకు మూలాల నుంచి ప్రామాణికమైన ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి ప్రతిభను ప్రోత్సహించి, వారిని ప్రపంచం ముందుకు తీసుకువచ్చేందుకు ఇఫీ పోషిస్తున్న పాత్రను, దానిని పునరుద్ఘాటిస్తున్న ఇఫీ 2024 ఇతివృత్తం గురించి ప్రముఖంగా చర్చించారు. క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ద్వారా నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటూ ‘‘వెలుగులోకి రాని ప్రతిభను ప్రపంచం ముందుకు తీసుకురావాలి’’ అని అన్నారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

అభివృద్ధి, వారసత్వంతో ముందుకు సాగిపోయేందుకు కట్టుబడి ఉన్నాం: ప్రధాన మంత్రి

ఇగాస్ పండుగ సందర్భంగా పౌరులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు.  అభివృద్ధి, వారసత్వంల మేలికలయికతో …