सोमवार, जनवरी 19 2026 | 11:39:26 AM
Breaking News
Home / Choose Language / telugu / పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 11న విశాఖపట్నంలో శిబిరాల నిర్వహణ

పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 11న విశాఖపట్నంలో శిబిరాల నిర్వహణ

Follow us on:

ముఖ ప్రామాణీకరణ సాంకేతికత ద్వారా పింఛనుదారుల కోసం లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను క్రమబద్ధీకరించడానికి పింఛన్ మరియు పింఛనుదారుల సంక్షేమ విభాగం (డీఓపీపీడబ్ల్యూ) నవంబర్ 2024లో దేశవ్యాప్తంగా ప్రచారం 3.0ని నిర్వహిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ ఆధారిత గుర్తింపు ద్వారా పింఛనుదారులు సర్టిఫికేట్‌లను సమర్పించడానికి ఈ పద్ధతి అనుమతిస్తుంది.

మునుపు, పింఛనుదారులు పింఛను పంచే అధికారిక వ్యవస్థలను సందర్శించవలసి వచ్చేది, ఇది వృద్ధులకు తరచూ సవాలుగా ఉండేది. 2014 లో, డీఓపీపీడబ్ల్యూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను (జీవన్ ప్రమాణ్) మరియు 2021లో ముఖ ప్రామాణీకరణ సాంకేతికతని పరిచయం చేసింది. ఈ పురోగతి బయోమెట్రిక్ పరికరాల అవసరాన్ని తొలగించి, ప్రక్రియను మరింత ఉపయోగకరంగా అందుబాటులోకి తెచ్చింది.

2022లో, డీఓపీపీడబ్ల్యూ 37 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి, 1.41 కోట్ల డీసీఎల్‌లను ఉత్పత్తి చేసింది. అలాగే 2023 ప్రచారం 100 ప్రాంతాలకు విస్తరించి, 1.47 కోట్లకు పైగా డీసీఎల్‌లు ఉత్పత్తి కావడం జరిగింది.

ప్రచారం 3.0 (నవంబర్ 1-30, 2024 నుంచి షెడ్యూల్ చేయబడింది), దేశవ్యాప్తంగా 800 ప్రాంతాలను ఇది కవర్ చేయనుంది. బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పెన్షనర్స్ అసోసియేషన్స్, యూఐడిఏఐ, ఎమ్ఈఐటీవై, రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ మరియు డీఓటి మొదలైనవి కీలక భాగస్వాముల్లో భాగంగా ఉన్నాయి. డిజిటల్ సమర్పణలతో పింఛనుదారులకు సహాయం చేయడానికి నగరాల్లో శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంటింటికీ సందర్శించడంతో సహా వయోవృద్ధులు లేదా వికలాంగ పింఛనుదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. డీఎల్‌సీ పోర్టల్ ద్వారా డీఓపీపీడబ్ల్యూ పర్యవేక్షణతో సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రోత్సహిస్తుంది.

రిమోట్ లేదా పరిమితంగా కదలగలిగు పింఛనుదారులు కూడా ఈ క్రమబద్ధీకరించబడిన, ఉపయోగించడానికి అనువైన వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందేలా చూడడమే ఈ ప్రచారం యొక్క లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఐపీపీబీ విశాఖపట్నంలో వివిధ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. యూబీఐ నగరంలోని సీతమ్మధార బ్రాంచ్ (మెయిన్), విశాఖపట్నం మెయిన్ 3 బ్రాంచ్, సెయింట్ ఆన్స్ బ్రాంచ్ మరియు మధురవాడ బ్రాంచ్ వంటి  వివిధ ప్రదేశాలలో శిబిరాలను నిర్వహిస్తోంది. అలాగే ఐపీపీబీ నవంబర్ 11, 2024న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో మెగా శిబిరాన్ని నిర్వహిస్తోంది. పింఛను మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ (ఓఎల్) శ్రీమతి మంజు గుప్తా యూబీఐ మరియు ఐపీపీబీ శిబిరాలను సందర్శిస్తూ ఉంటారు. అలాగే పింఛనుదారులు వారి లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించడానికి వివిధ డిజిటల్ విధానాలను ఉపయోగించడంలో పింఛనుదారులకు సహాయం చేస్తారు.

ఈ శిబిరాల్లో యూఐడిఎఐ పింఛనుదారులకు అవసరమైన చోట వారి ఆధార్ రికార్డులను అప్‌డేట్ చేసుకోవడానికి, మరియు ఏదైనా సాంకేతిక సమస్యలను కూడా సరిచేసుకోవడానికి సహాయం చేస్తుంది.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …